కరీంనగర్

హుజూరాబాద్ కాంగ్రెస్‌కు మరోషాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఏప్రిల్ 17: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బిసి కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి, సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉపఎన్నికల్లో హుజూరాబాద్ నుండి వకుళాభరణం పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి సిఎం రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వకుళాభరణంను ప్రోత్సహించారు. ఓటమి చెందినా, తదనంతర ఎన్నికల్లో టికెట్ రాకున్నా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అంతకుముందు టిఆర్‌ఎస్ నేత కెప్టెన్ వొడితెల లక్ష్మికాంతరావు మంత్రిగా ఉండగా ఆయన సహకారంతో బిసి కమిషన్ సభ్యునిగా కూడా పనిచేశారు. బిసి సంఘంనేత ఆర్.కృష్ణయ్యకు సన్నిహితునిగా ఆయనతో కలిసి విద్యార్థి దశ నుంచే ఆనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని బిసి నేతగా ఎదిగారు. ఇటీవలే మరో సీనియర్ నేత కేతిరి సాయిరెడ్డి సోదరుడు సుదర్శన్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందగా, ప్రస్తుతం వకుళాభరణం రాజీనామాతో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇటీవల మీడియా చర్చల్లో, మీడియా వ్యాసాల్లో వకుళాభరణం, టిఆర్‌ఎస్, కెసిఆర్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై పలువురి ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి మనస్తాపం చెందిన ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అలాగే వకుళాభరణం శ్రీ్ధర్ బాబు అనుకూల వర్గంలో పొన్నం వ్యతిరేక వర్గంలో ఉన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోగా నాయకులు ఎక్కువయ్యారు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వారి వ్యవహార శైలి ఉంది. ఒకరికి టికెట్ వస్తే మిగతా నాయకులు సహకరించకపోవడం, వ్యతిరేకంగా పనిచేయడం జరగుతూ వస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వౌనంగా ఉంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దగ్గరి బంధువైన కౌశిక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవిందర్‌రెడ్డి, స్వర్గం రవిలు కాంగ్రెస్‌లో నాయకులుగా ఉన్నారు. వకుళాభరణం రాజీనామాతో నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి. రాజీనామా తర్వాత వకుళాభరణం టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారా? లేక బిసి ఉద్యమనేతగా కొనసాగుతారా? అనేది చర్చనీయాంశమైంది.