కరీంనగర్

సమస్యలు సృష్టిస్తున్న తెరాస సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 23: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెరాస ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా కాకుండా సమస్యలను సృష్టిస్తూ చాకచక్యం అనుసరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ఆరోపించారు. శుక్రవారం సిరిసిల్లలో జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం లేని, పరిధిలో లేని వాటిపై అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ, హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నదని అన్నారు. కేంద్ర మంత్రిగా, సీఎంగా 35 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా తెలిసి ఉండి, చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసగిస్తున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ కూళీలకు నాలుగైదు నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని, కేంద్రంపై భారం మోపుతున్నాడని అన్నారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ కావాలని చేస్తున్న ఉపాధ్యాయుల ఆందోళన, మెడికల్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల క్రమబద్దీకరణ మొదలైన సమస్యలపై సీఎం అనుచిత వైఖరి అవలంభిస్తున్నాడని, పరిష్కారంలో చిత్తశుద్ది లేదన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలు, ధర్నాల టెంట్లు ఉండవని చెప్పిన కేసీఆర్ వీరిని క్రమబద్దీకరించడంలో విఫలం చెందారన్నారు. 2005 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు పంపడంలో విఫలమయ్యాడని, కోర్టు తీర్పుపై తదుపరి చర్యలు ఏమిటో లేవని, ఇక్కడ కొత్త ఉద్యోగాల అంశం చెప్పడం లేదన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రూ.10 వేలు కోట్లు కేటాయించారని, 10 నెలలుగా వీరిని గుర్తించడంలో చిత్తశుద్ది లేదని, ఎస్సీలకు కేటాయించిన రూ.42 వేల కోట్ల నిధులు ఖర్చు చేయలేదంటున్నారని, వీరికి నిధులు ఖర్చు చేయడంలో అంటరాని, ముట్టరాని వారిగావ్యవహరిస్తున్నదని అన్నారు. నిధులను మిగిలించరాదని చట్టం ఉన్నా అమలు చేయడం లేదన్నారు. 12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రాజ్యాంగ బద్దంగా ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి తమకు అధికారం లేకున్నా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం కొరివి పెట్టిందని అనడం మెసగించడమే నన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితుల ఇళ్లపై దాడి చేసి వారు తినే భోజనంలో ఇసుకను వేశారని, దీనిపై ఇంత వరకు చర్యలు లేవన్నారు. మాల మాదిగలపై దాడులు జరుగుతున్నా వాటిని నిరోధించడంలో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వం విఫలం అయిందన్నారు. మూడు ఎకరాలు ఇవ్వడంలో స్థలాలు లేవంటున్న ప్రభుత్వం వీరికి తలా రూ.15 లక్షలు ఇచ్చి, వ్యాపారం చేసుకునేలా చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ళలో చేసిందేమీ లేదని, వచ్చే బడ్జెట్‌లోనైనా తగిన నిధులు కేటాయించాలన్నారు. దళితుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం తీరును ప్రజల ముందు నిలబెడుతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎండగడుతామన్నారు. అనంతగిరి ప్రాజెక్టు భూసేకరణలో పరిహారం కోసం కోర్టును వెళ్ళిన రైతుల డిమాండ్‌ను గమనించి సమస్య పరిష్కరించకుండా వారి భూములను తప్పించడానికి ఏకంగా ఆనకట్ట అలైన్ మెంటు మార్చారని, ఇలా డిజైన్లు, కట్ట నమూనాలు మార్చి, ఇంజనీర్లను అవమానించడమేనని అన్నారు. ఈ చర్య వల్ల కట్ట మూడు వంకర్లు తిరిగి పోతున్నదని అన్నారు. డీపీ ఆర్‌లో లేని విధంగా డైజైన్లు మార్చడం ఇంజనీర్ల నైపుణ్యంను కాలరాయడం, కట్ట సామర్థ్యంపై అనుమానాలకు తావిస్తున్నదని ఆరేపల్లి మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు అకునూరి బాలరాజు, నాయకులు నాగుల సత్యనారాయణ, బుర్ర నారాయణగౌడ్, నాలుక సత్యం, ఆడెపు చంద్రకళ, వెల్ముల తిరుపతిరెడ్డిలు పాల్గొన్నారు.