కరీంనగర్

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఫిబ్రవరి 23: పసుపు, మొక్కజొన్న, వరి పంటలకు ప్రభుత్వం మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జగిత్యాల జిల్లా రైతులు కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన పాదయాత్ర నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో తరలివచ్చిన రైతులు మిని స్టేడియం నుండి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట కలెక్టరేట్ కార్యాలయం వరకు దాదాపు 5వేల మంది రైతులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట జగిత్యాల, కరీంనగర్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించిన పంటకు గిట్టుబాటు ధరలేక నష్టాల ఊబీలో కూరకపోయిన ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల నినాదాలతో జిల్లా కేంద్రంలోని రాహదారులు మార్మోగాయి. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎఒ మహేశ్వర్‌కు వినతి పత్రం అందచేశారు. పసుపు పంటకు రూ. 15వేలు, వరికి 25వందలు, మొక్కజొన్న క్వింటాలుకు 25వందలు చెల్లించాలని రైతులు కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లా రైతు ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన పాదయాత్రలో జగిత్యాల, గొల్లపల్లి, మల్యాల, మేడిపల్లి, కొడిమ్యాల, కథలాపూర్, మెట్‌పల్లి, కోరుట్ల మండలం, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం
* కన్యాధాతలుగా గంగుల కుటుంబసభ్యులు * కళ్యాణాన్ని తిలకించిన వేలాది మంది భక్తులు

కరీంనగర్, ఫిబ్రవరి 23: సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. కరీంనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశేష భక్తజనం వేయి కన్నులతో తిలకిస్తుండగా, ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు, మంగళ వాయిద్యాల మధ్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆ బహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా శాస్త్రోక్తంగా జరిగింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులైన గంగుల సుధాకర్ శారద దంపతులు, గంగుల కమలాకర్ రజిత దంపతులు, మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున, ఎంపీ వినోద్ సతీమణి రజనీలు స్వామివారికి పట్టువస్త్రాలు, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లకు పుట్టింటి లాంచనాలు అందించి శ్రీనివాసుడికి కన్యాధానం చేయగా, వేద పండితులు గుదిమెళ్ల విజయ్‌కుమారాచార్యులు కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకల్లో సందర్భోచితంగా వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ శ్రీదేవి, భూదేవిల గురించి వివరిస్తూ చేసిన ఆద్యాత్మిక ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. నాద నీరాజనం వేదికపై బొజ్జ రేవతి, గోగుల ప్రసాద్, చిలువేరు శ్రీకాంత్, తిప్పబత్తిని రవీందర్‌లు స్వామి వారి కీర్తనలతోపాటు కళ్యాణోత్సవ సందర్భానుసారంగా ఆలపించిన కల్యాణ ఘంటసాల గీతాలు, సంకీర్తనలు భక్తుల మదిని దోచాయి. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులందరికీ అన్న ప్రసాదంతోపాటు శ్రీవారి తిరుపతి లడ్డును అందజేశారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆరాధన, చతుస్థానార్చాన, యాగశాలలో విశేష హోమాలు, కళ్యాణం అనంతరం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, సహస్ర దీపాలంకరణ సేవ, మూలమంత్ర హవనం, పంచసూక్త హవనం, హరిహర హోమం, పూర్ణాహుతి, బలి హరణ తదితర పూజలు అర్చకులు నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, పలువురు కార్పోరేటర్లు, ఆలయ పాలకమండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో శ్రీరామ పాదుక పట్ట్భాషేక శోభాయాత్ర జరగనుంది త్రిదండి చినజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ఏనుగు, ఆరు గుర్రాలు, ఆరు ఒంటెలు, 10 ఎద్దులు, 200 కళాకారులు, 25వేల మంది భక్తులతో మార్క్‌ఫెడ్ నుంచి ప్రకాశం గంజ్ వరకు శోభాయాత్ర సాగనుండగా, భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బద్రీ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర శాంతియుత వాతావరణంలో కొనసాగించాలని జేసీ కోరారు.
బ్రహోత్సవాల్లో భాగంగా
శ్రీనివాసుడి బ్రహోత్సవాల్లో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసుకునేందుకు ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మార్క్‌ఫెడ్ మైదానంలో విద్యార్థులు వేంకటేశ్వరుడి వేషధారణలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని 110 ప్రైవేట్ పాఠశాలల నుంచి 7,100 మంది విద్యార్థులు హిందు సాంప్రదాయ ఆచార పద్దతిలో పంచె కట్టుతో, నుదుటిపై నామాలు పెట్టుకుని పాల్గొనగా, వీక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కమలాకర్, గ్రంధాలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ట్రస్మా ప్రతినిధులు శేఖర్‌రావు, సంజీవరెడ్డి, ప్రసాదరావు, చెన్నప్ప, శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రైవేట్ విద్యా సంస్థల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.