క్రైమ్/లీగల్

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్తి, మార్చి 12: రుద్రంగి మండల కేంద్రంలో మతిస్థిమితం లేని 45 సంవత్సరా వివాహితపై ఇదే గ్రామానికి చెందిన పిడుగు లచ్చిరెడ్డి (60) అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రామకృష్ణపూర్ కాలనీకి చెందిన వివాహిత ఇంటిలో ఒంటరిగా ఉండగా పొలం పనులకు వెళ్లిన లచ్చిరెడ్డి ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారయత్నానికి ఒడిగట్టగా ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి లచ్చిరెడ్డిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై వేములవాడ డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ ఆరా తీసి నిందితునిపై కేసు నమోదు చేయాలని రుద్రంగి పోలీసులను డీఎస్పీ ఆదేశించారు.

కొమటిరెడ్డి దిష్టి బొమ్మ దగ్దం
హుస్నాబాద్, మార్చి 12: ఆసెంబ్లీ సాక్షిగా సొమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసెంబ్లీలో అనుచిత ప్రవర్తణను నిరసిస్తు సోమవారం హుస్నాబాద్ పట్టణంలో అక్కన్నపేట చౌరస్తాలో టిఅర్‌ఎస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను ఏకవచనంలో సంబోధించడం గవర్నర్ ప్రసంగం చేస్తుండగా పెన్నులు హెడ్‌ఫోను విసరడం పక్కనే ఉన్న శాసన మండలి చైర్మన్ స్వామి గౌడుకు తీవ్రమైన గాయం కావడం హేయమైన చర్య అని వారు ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమనే భయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అన్వర్, రైతు సమన్వయ సంఘ అధ్యక్షుడు కొండాల్‌రెడ్డి, ఎడబోయిన తిరుపతిరెడ్డి, లక్ష్మన్‌నాయక్, కొండ్లే హన్మంతరెడ్డి పాల్గొన్నారు.

దొంగల అరెస్టు
కోరుట్ల రూరల్, మార్చి 12: పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న యువకునితో పాటు ఒక మైనర్ బాలుడిని సోమవారం కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం ప్రశాంత్‌తో పాటు బాలుడు ఇళ్ల దొంగతనాలు చేస్తూ పట్టుబడగా, వారి నుండి 41 వేల రూపాయల నగదు, రెండు తులాల బంగారు గొలుసు, 25 విలువ చేసే టాబు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. టాబు విక్రయించే క్రమంలో నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా పట్టణానికి ప్రజలు ఎవరైన తాళాలు వేసి ఊర్లకు వెల్లదలిస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా వేస్తామన్నారు. విలువైన బంగారం, నగదు ఉంటే పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచి రషీదు పొందాలని సూచించారు.