కరీంనగర్

పావనిపై వేటు వేస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 21: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ ఉదంతంపై మున్సిపల్ కౌన్సిల్‌ను సమావేశ పర్చడం లేదు, నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేశ్‌రావు ప్రశ్నించారు. ఈ ఉదంతంలో చైర్‌పర్సన్ పావనిని బలి తీసుకునే హక్కు మంత్రికి లేదని, వెంటనే కేటీఆర్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా మున్సిపల్‌తో పాటు అన్ని శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరుగుతున్నది తాము చెబుతున్నదే మున్సిపల్ చైర్‌పర్సన్ పావని దృవీకరించిందని, నిజం చెప్పి తిరుగు లేని సాక్ష్యంగా నిలిచిందన్నారు. అన్ని మండలాల్లో తెరాస నేతలు రెండు శాతం కమీషన్లు తీసుకుంటూ అక్రమ ఆస్తులు కూడ బెట్టారని, వాటిని బహిర్గతం చేస్తామన్నారు. సిరిసిల్ల ఉదంతంపై మంత్రి ఎందుకు స్పందించడం లేదని, జవాబు చెప్పకపోవడంతో ఇక్కడ ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. పావనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోకుండా రాజీనామా చేసి బలి చేయడం సరికాదన్నారు. గతంలో సిరిసిల్ల సెస్‌ను అవినీతి అక్రమాలతో నిండా ముంచిన చైర్మన్ చిక్కాల రామారావుపై ఎలాంటి చర్యలు లేకుండా రక్షించారని, ఇపుడు పావనిపై ఎందుకు వేటు వేశారన్నారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ రాజీ పడబోదని, పతనం అంచున టీఆర్‌ఎస్ చేరిందని అన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సీఎం హామీ ఇచ్చిన ప్రభుత్వ వైద్య శాలను సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ మానేరులో పూడిక కోసం రూ.4 కోట్లు కేటాయించగా, 32 నెలలుగా పూడిక తీయకపోవడంతో రెండు టీఎంసీల నుండి ఒకటిన్నర టీఎంసీలకు ఎగువ మానేరు ప్రాజెక్టు సామర్థ్యం దిగిపోయిందని, వేసిన శిలాఫలకం వెక్కిరిస్తున్నదన్నారు. నాలుగు ఏళ్ళలో పూడిక తీయించలేని మంత్రి లక్ష ఎకరాలకు ఎలా నీరిస్తారని ప్రశ్నించారు. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన వీర్నపల్లి, తంగళ్ళపల్లి మండలాలకు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని, హంగూ లేదన్నారు. గ్రామాలలో కూలీల ఉపాధిని దెబ్బతీసే విధంగా మున్సిపల్‌లో గ్రామాల విలీనం నిర్ణయం సరికాదని, ముందుగా సిరిసిల్ల మున్సిపల్‌ను అభివృద్ది చేయండని, ఎగువ మానేరులో పూడిక తీసి లక్ష ఎకరాలకు నీరివ్వండని ఉమేశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల ఓరుగంటి తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆడెపు చంద్రకళ, నాయకుల కూతురు వెంకటరెడ్డి, మైనార్టీ నాయకులు సాహెబ్, ఎడ్మల భూపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.

- ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు
* లోపాయికారి ఒప్పందంతోనే పార్లమెంటులో రగడ
* బీజేపి చేతిలో తెరాస ఎంపిలు కీలుబొమ్మలు
* టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్
కరీంనగర్ టౌన్, మార్చి 21: ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ల అమలుపై అధికార టీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మైనార్టీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల అమలుకై కేంద్రంపై ఉద్యమ కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు కాకపోతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేయాలన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకే రిజర్వేషన్లపై గలాటా సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. లోపాయికారి ఒప్పందాలతో పార్లమెంటులోతెరాస ఎంపిలు వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తారు. అసెంబ్లీ అల్లర్లలో ఎలాంటి సంబంధంలేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశాల నుంచి బహిష్కరించి, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని ధ్వజమెత్తారు. తన పాలనపై నైతికత ఉంటే సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పావని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి మంత్రి కేటీఆర్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపి చేతిలో కీలుబొమ్మలా మారిన టీఆర్‌ఎస్ తన స్వప్రయోజనాల కోసమే ఆందోళనలు చేస్తుంది తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, పడిశెట్టి భూమయ్య, వెంకటరమణ, రమణారావు, కర్ర రాజశేఖర్, రత్నాకర్, రమ్యారావు, గుగ్గిల్ల జయశ్రీ, కార్పోరేటర్లు ఆకుల ప్రకాశ్, అజిత్‌రావు, దిండిగాల మధు, పాల్గొన్నారు.