కరీంనగర్

ఊపందుకున్న విమానాశ్రయం ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, పెద్దపల్లి రూరల్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాలను నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వ సిఫారాసులపై కదలిక వేగిరమయ్యాయి. పారిశ్రామిక ప్రాంతంగా రాష్ట్రంలోనే అత్యధిక ధనిక జిల్లాగా పేరు నమోదు చేసుకోబోతున్న పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ ఊపందుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన భూసేకరణ విషయాలపై పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో విమానాశ్రయం నిర్మాణం చేయదలిచే స్థలాన్ని కలెక్టర్ శ్రీదేవసేన ఉన్నతాధికారులతో కలసి పరిశీలన చేశారు. బసంత్‌నగర్ పరిసర ప్రాంతంలో విమాశ్రయ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు.విమానాశ్రయ నిర్మాణానికి 530 ఎకరాలు భూమి అవసరం ఉండగా, ప్రస్తుతం రెవిన్యూ రికార్డుల ప్రకారం 291 ఎకరాల భూమి ఉంది. మిగితా భూమిని బసంత్‌నగర్‌తో పాటు పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామ పరిధి నుంచి సేకరించిందేకు సంబంధిత ప్రక్రియను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని, మ్యాప్‌ను ఆమె పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నాలు చేస్తుందన్నారు. బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఎంత వరకు భూమి అనుకూలంగా ఉంన్నది, అవసరమైన భూసేకరణ చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ భూమి సేకరణకు ఎకరాకు మార్కెట్ ధర ఎంత ఉనది, రైతులు ఇవడానికి సిద్ధంగా ఉన్నదా.. అనే విషయాల గురించి స్థానిక అధికారుల ద్వారా తెలుసుకన్నట్టు సమాచారం. విమానాశ్రయాన్ని అనుకొని ఉన్న భూములకు సంబంధించిన వివరాలు వెంటనే తనకు అందజేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లా పారిశ్రామికంగా, పర్యాటకంగా, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి తహశీల్దార్ వేణుగోపాల్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.