కరీంనగర్

ఈ నెలాఖరులోగా నేషనల్ హైవే నిర్మాణాలకు భూ సేకరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో జాతీయ రహదారులకు భూసేకరణ, హరితహారం, సివిల్ సర్వీసెస్ డే, భూ రికార్డుల నవీకరణ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యక్రమాలు, గ్రామ స్వరాజ్ అభియాన్ తదితర అంశాలపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేట్‌కు సంబంధించి ఆధార్ సీడింగ్‌ను తహశీల్దార్లు తమ డిజిటల్ సంతకాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ముద్రించిన 20లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను జిల్లాలకు పంపించామని, ఒరిజనల్ రికార్డులతో సరిచూసుకోవాలని, ఏమైనా తేడా ఉంటే పంపించాలని సూచించారు. పట్టాదార్ పుస్తకాల ముద్రణ, ధరణి వెబ్‌సైట్‌లో రికార్డుల ఆధునీకరణ తదితర అంశాలపై సిఎం కేసిఆర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్మాణాలకు అవసరమైన భూమి కోసం వక్ఫ్‌బోర్డు భూములను గుర్తించాలని కోరారు. మైనారిటీ శాఖకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల సేకరణలో గుర్తించిన వక్ఫ్ భూములకు సంబంధించి ఎటువంటి ఆక్షేపణలు లేని వక్ఫ్ భూములకు వక్ఫ్ సంస్థల పేర పట్టాదార్ పుస్తకాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల మతవల్లిల పేరిట ఉన్న భూములను వక్ఫ్ సంస్థల పేరిట ఉన్న పట్టాదార్ పుస్తకాలు జారీ చేయాలని తెలిపారు. మైనారిటీ శాఖ ద్వారా 319 మైనారిటీ సంస్థలకు అభివృద్ధి పనుల మరమ్మత్తుల కోసం రూ.35 కోట్ల నిధులు మంజూరు చేశామని, పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 46చోట్ల గుర్తించిన భూములను అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలలు, హాస్టళ్ల భవనాలను గుర్తించాలని అన్నారు. షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలలకు 72చోట్ల భూములను గుర్తించాల్సి ఉందని, మరో 10చోట్ల గుర్తించిన భూములను అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ నెల 21న సివిల్ సర్వీసెస్ డే నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. జిఎడి డ్యాష్ బోర్డులకు అవసరమైన బేసిక్ డాటాను వెంటనే అప్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఏడు ముఖ్య పథకాలను ప్రత్యేకాధికారులు సమీక్షిస్తున్నారని, వీటిపై దృష్టి సారించాలని అన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి సంబందించి జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ వెంటనే తయారు చేసి పంపించాలని, నర్సరీలకు సంబంధించి ప్లానింగ్ మెటీరియల్ సమకూర్చుకోవాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ఇంతవరకు నాటిన మొక్కల సంరక్షణకు ప్రాదాన్యతనివ్వాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా జిల్లాల్లో నాటిన మొక్కలన్నింటికీ వారంలో ఒకరోజు నీరు పోసేలా అందరిని భాగస్వాములను చేయాలని జోషీ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, డిఆర్‌ఓ ఆయేషామస్రత్ ఖానం, జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.