కరీంనగర్

గురుకులాల్లో స్వెరోస్ కార్యకలాపాలు నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 20: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో స్వెరోస్ కార్యకలాపాలు నిషేధించాలని జాతీయ ఎస్‌సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, స్వెరోస్ పేర గురుకులాల్లో అనేక అవినీతి, అక్రమాలు, అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారని, ఫలితంగా విద్యార్థులు గురుకులాల్లో చదువుకునేందుకు భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ, గురుకులాల్లో పలు కాంట్రాక్టులు కూడా వారికే అప్పగిస్తుండటం శోచనీయమన్నారు. గురుకుల టెండర్ ప్రకటనల్లో సైతం స్వెరోస్‌కే ప్రాధాన్యత ఇస్తామంటూ పేర్కొనటం వెనుక ఎవరి ప్రోద్భలముందోప్రకటించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, గురుకుల వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తున్న సాంఘీక సంక్షేమ గురకులాల కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్‌ను సత్వరమే తొలగించాలని డిమాండ్ చేశారు. బోధన, బోధనేతర సిబ్బందిపై అజమాయిషీ చేస్తూ, తమ చెప్పుచేతల్లో లేని వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గురుకులాల పరిశీలన పేర వసతి గృహాల్లో చొరబడి విద్యార్థినీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, గచ్చిబౌలి, ఆదిలాబాద్‌లోని గురుకుల పాఠశాలల్లో జరిగిన సంఘటనలని అన్నారు. విద్యార్థుల్లో విష బీజాలు నాటుతూ, హిందూ మతం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న స్వెరోస్, క్రిస్‌మస్ వేడుకలు గురుకులాల్లో నిర్వహించటం వెనుక గురుకుల కార్యదర్శి ప్రవీన్‌కుమార్ హస్తముందని ఆరోపించారు. ఐదేళ్ళుగా స్వెరోస్ పేర గురుకులాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఉద్యోగ నియామకాలపై విచారణ కమిటీ నియమించాలని, అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి లక్ష్మన్, నాయకురాలు సుంకె యశోధ, తదితరులు పాల్గొన్నారు.