కరీంనగర్

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మే 20: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ వేసిన కమిటీలో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రాను శనివారం కలిసి విన్నవించినట్లు తెలంగాణ ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. హైదరాబాద్‌లో అజయ్‌మిశ్రాను కలిసి సన్మానించామని, ఈ సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పెంచాలని, 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, డబుల్ బెడ్‌రూం కాలనీలను నిర్మించాలని, కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సును 20 శాతం ఇవ్వాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అజయ్ మిశ్రాను కోరినట్లు ముజాహిద్ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుండి 14.5 శాతానికి పెంచాలని, కళాశాలల్లో కాంట్రాక్టు పద్దతిన, ఔట్ సోర్సింగ్ పద్ధతిని పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరామన్నారు. అజయ్ మిశ్రాను కలిసిన వారిలో ఖాజా నిజామొద్దీన్, నరుూమొద్దీన్, సలీంబేగ్, మునీరొద్దీన్, షఫి, ఇలియాస్, ముజీబ్, రఫి, గౌస్, హైదర్ అలీ, కరీం తదితరులు ఉన్నారు.