కరీంనగర్

ఏవౌతుందో.. ఏమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 20: స్థానిక సంస్థల సంగ్రామం వడివడిగా చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఆరునూరైనా ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో ఇప్పటికే విందు, వినోదాలకు లక్షల్లో ఖర్చు చేస్తున్న నేతలకు రిజర్వేషన్ల గుబులు పట్టుకుంది. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చేయనున్న రిజర్వేషన్లు ఎలా ఉండబోతాయోననే ఆందోళన వారిలో నెలకొంది. అధికార పార్టీ నేతలు మాత్రం ముందస్తుగానే మేల్కొని రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చేలా ప్రయత్నాలు ఆరంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా స్థానిక సంస్థల సమరానికి అధికారులు చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా ఇటు ఆశావహుల్లో, అటు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంటోంది. అందులో భాగంగా అత్యంత ప్రధానమైన ఓటరు జాబితా ముసాయిదాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1,211 గ్రామ పంచాయతీల్లో ఈనెల 17న ప్రకటించిన విషయం విదితమే. రిజర్వేషన్లు కేటాయించడానికి కీలకమైన బీసీ ఓటర్ల గణన చేపట్టగా, ఈ ప్రక్రియ మరో రెండ్రోజుల్లో పూర్తి చేసుకుని ఈనెల 22న బీసీ ఓటర్ల జాబితాను పంచాయితీల్లో ప్రదర్శిస్తారు. అనంతరం 24, 25 తేదీల్లో జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడం, 28 నుంచి 30వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించి, చివరగా జూన్ 1న బీసీ ఓటర్ల జాబితాను పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. బీసీ ఓటర్ల లెక్కలతోనే గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. 1995 నుంచి ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న రొటేషన్ రిజర్వేషన్ విధానాన్ని అంచనా వేసేందుకు నేతలకు కొంతమేర అవకాశం ఉండేది. కానీ, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఖరారు చేసే రిజర్వేషన్లు ఎలా ఉండబోతాయోనని ఆశావహులు ఆందోళనతో ఉన్నారు. అయితే, ఈ విషయంలో అధికార పార్టీలోని ఆశావహులు ముందే మేల్కొని రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చేలా చూడాలని తమ అధినేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రక్రీయపై ప్రస్తుతం ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇప్పటికే సర్పంచ్‌లుగా పోటీ చేయాలనుకున్న ఆశావహులు విజయం సాధించడానికి అవసరమైన సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకునేందుకు విందులు, వినోదాలతో లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. తమకు దగ్గరుండి సహకరించే వారిని యాత్రలకు తీసుకెళ్తున్నారు. ఎలాగైనా సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆశావహులు ఎన్నికల్లో ఎంత ఖర్చయనా చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగానే కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు కూడా జరుగనున్న దరిమిలా స్థానిక సంగ్రామం అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌గా మారనుండగా, మెజారిటీ స్థానాలు సాధించి సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించాలన్న వ్యూహంతో ఆయా పార్టీల నేతలు కసరత్తులు మొదలు పెట్టారు. గెలుపు గుర్రాల అనే్వషణలో నిమగ్నమయ్యారు. ఏదిఏమైనా గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా పల్లెల్లో వడివడిగా ఎన్నికల సందడి ఊపందుకుంటుండగా, ఇటు ఆశావహుల్లో, అటు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.