కరీంనగర్

కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, మే 20: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఏ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పులి ఆంజనేయులు మాట్లాడారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బిజెపి చేసిన కుయుక్తులు చెల్లుబాటు కాలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం మరోమారు ప్రజ్వరిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు పంజాల శ్రీనివాస్, మెట్‌పల్లి వీరయ్య, బొమ్మరవేని తిరుపతి, పిండి శ్రీనివాస్, కడారి మల్లయ్య తదితరులు ఉన్నారు.