కరీంనగర్

గ్రామ రక్షక దళాలతో శాంతి భద్రతల పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మే 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం గ్రామ రక్షక దళాలు కృషి చేయాలని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ టీ.సుదర్శన్ గౌడ్ కోరారు. నేరాల నియంత్రణలో గ్రామ రక్షక దళాలలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. మండలంలోని చీకురాయి గ్రామంలో పెద్దపల్లి పోలీసులు గ్రామ రక్షక దళం సభ్యులకు టాఠీలు, టార్చి లైట్లు ఆదివారం రాత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాత్రి వేళల్లో దొంగ తనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో గస్తీ తిరుగాలన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాక, భారీ విధ్వంసాలకు రూప కల్పలన వంటి వాటిపై నిఘా ఉంచి పోలీసులకు తగిన సమాచారం ఇవ్వాలని సూచించారు. దొంగల ముఠాకు సంబంధించిన సమాచారం తెలుసుకొని గ్రామాల్లో ప్రజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏదైన కొత్త విషయం తెలిసినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణ కోసం షీటీంలు పని చేస్తున్నాయని తెలిపారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డెన్ చర్చ్ పేరుతో గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎసీపీ హబీబ్ ఖాన్, సీఐ గోపతి నరేందర్, ఎస్సైలు కర్రి జగదీష్, రవికుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం
* అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం

కరీంనగర్, మే 21: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూమిని వేగంగా సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బద్రీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, సాగు నీటి ఇంజనీర్లతో భూ సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిడ్‌మానేర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని వివిధ మండలాలకు, గ్రామాలకు కాలువలు తవ్వించి అన్ని గ్రామాలకు సాగునీరందించేందుకువీలుగా అవసరమైన భూమిని వెంటనే సేకరించాలని అధికారులు ఆదేశించారు. నీటి పారుదలశాఖ ఇంజనీర్లు అవసరమైన భూమిని వెంటనే ఆర్డీఓలకు ఇండెంట్ ఇవ్వాలని సూచించారు. భూమికి సంబంధించి పెగ్‌మార్క్ చేయాలని, సేకరించాల్సిన భూమిని వెంటనే సర్వే చేయించాలని ల్యాండ్ సర్వే ఎడిని ఆదేశించారు. సంబంధిత భూముల రైతులతో మాట్లాడి ధరలు నిర్ణయించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఎంత భూమి సేకరించాలి, ఇప్పటివరకు ఎంత సేకరించారన్న విషయమై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీఓలు రాజాగౌడ్, చెన్నయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటమాధవరావు, ఆర్‌అండ్‌బి ఇఇ రాఘవచారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.