కరీంనగర్

దేశం కోసం ప్రాణ త్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మే 21: భారత దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘన కీర్తి గల పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అలాంటి మహానీయుడైన రాజీవ్‌గాంధీని దేశం మరువలేదని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన బైపాస్ రోడ్‌లో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ త్యాగాల పునాదులపైనే కాంగ్రెస్ నిర్మాణం జరిగిందని దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కొనియాడారు. ఇందిరా, రాజీవ్‌గాంధీ ఆశయసాధన కోసం పునరంకితమై పని చేస్తామన్నారు. నాడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఎల్‌టీటీఇ ఉగ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందని తెలిసినా లెక్క చేయకుండా దేశ రక్షణకోసం ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించేందుకు వెనకాడని నేతలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం అనునిత్యం ఆలోచించే దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ బడుగు,బలహీన, అట్టడుగువర్గాల హృదయాంతరాలలో చెరగనిముద్ర వేసుకున్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గిరి నాగభూషణం,కొత్త మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదింటి ఆడపిల్లకు వరం ‘కల్యాణ లక్ష్మి’
* హుస్నాబాద్ ఎమ్యెల్యే సతీష్‌బాబు
హుస్నాబాద్, మే 21: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరమని హుస్నాబాద్ ఎమ్యెల్యే ఒడితెల సతీష్‌బాబు అన్నారు. సోమవారం హుస్నాబాద్ డివిజన్‌లో రెండు మంలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిని చేశారు.అక్కన్నపేట తహశీల్‌దారు కార్యాలయంలో 15లక్షల విలువ గల చెక్కులను 23 మందికి పంపిణీ చేయగా రెవెన్యూడివిజన్ కార్యాలయంలో హుస్నాబాద్ మండలానికి చెందిన 23.58 లక్షల చెక్కులను 33 మంది లబ్ధిదారులకు పంపిని చేశారు.ఈ సందర్భంగా ఎమ్యెల్యే సతీష్‌బాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్టంలో ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్య మంత్రికే దక్కిందని అన్నారు.పేదింటి అడపిల్లలకు భాగా చదివించేందకు రెసిడెన్షియల్ పాఠశాలు,కళాశాలు వివాహ సమయంలో పెళ్లికి ఎలాంటి ఖర్చు లేకుండ కళ్యాణలక్ష్మి,షాధిమూబారక్ వంటి పథకాలను అంకురార్పణ చేశారని ఎమ్యెల్యే అన్నారు. కేసీఆర్ సంకల్ప చాల గొప్పదని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే మహా నాయకుడని అదే సంకల్పంతో నేడు కాళేశ్యరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి చేసి గౌరవెల్లి,గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కోటి ఎకరాల నీరందించే దిశగా నిరంతరం కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావును ఎన్నటికీ ప్రజలు మరిచి పోలేరని పేర్కొన్నారు.అలాగే రైతులకు పెట్టుబడికి ఎలాంటి కష్టం రాకుండా చూడాలనే అలోచనతో రైతు బంధువు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి క్రింద ఎకరాకు 4వేలు అర్థిక సహయం అందింస్తున్నామని తెలిపారు.దీనికి తోడుగా జూన్ రెండు నుంచి రైతులకు రైతుభీమా పథకంను ప్రవేశ పెడుతుందన్నారు.ముందు ముందు మరిన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఎంపీపీ మంగ, అర్డీవో శంకర్‌కుమార్, నగరపంచాయతీ చైర్మెన్ యస్.చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయన్న, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, అన్వర్, మీర్జాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, ఎడబొయిన తిరుపతిరెడ్డి, తహశీల్‌దార్లు అక్కన్నపేట తహశీల్‌దార్,రాంచెంద్రం, హుస్నాబాద్ తహశీల్‌దార్ విజయసాగర్, తదితరులు పాల్గొన్నారు.