కరీంనగర్

పాలన ప్రతిభకు ప్రశంసలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 21: రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, తమదైన శైలీలో పాలనలో మార్పులతో ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, చీఫ్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషిల చేతుల మీదుగా కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణ్భాస్కర్, డాక్టర్ శరత్‌లు ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్నారు. కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలు, కేసీఆర్ కిట్ల పథకం సమర్థవంతంగా అమలు చేసినందుకుగాను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సిరిసిల్ల మున్సిపాలిటీలో ఘన వ్యర్థాల నిర్వహణ విషయంలో చూపిన విశేష చొరవకుగాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్‌లు తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరితోపాటు గతంలో పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేసిన అలుగు వర్షిణీ కూడా ఇసుక పన్ను విధానం అమలులో ఆదర్శంగా నిలువడంతో వ్యక్తిగత విభాగంలో తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైన విషయం విధితమే. ఈ మేరకు వీరు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రుల చేతుల మీదుగా తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డులందుకోవడం పట్ల అధికారులు, ఉద్యోగులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో
జిల్లాను నిలిపినందుకు జగిత్యాల కలెక్టర్‌కు అవార్డు
జగిత్యాల: ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి, రెవెన్యూ భూరికార్డుల శుద్ధీకరణలో జగిత్యాల జిల్లాను అగ్రగామిగిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ శరత్‌కు ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డును డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,మంత్రి కేటీఆర్‌ల చేతులమీదుగా సోమవారం హైదరాబాద్‌లో అందుకున్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు, రెవెన్యూ భూరికార్డుల శుద్దీకరణ పారదర్శకంగా చేసేలా అంకితభావంతో కృషి చేసిన ఆర్డీఓ నరేందర్, తహశీల్దార్ వెంకటేష్‌లు కూడా ఎక్సలెన్స్ అవార్డులను అందుకున్నారు.

వదంతులు నమ్మొద్దు
* జిల్లాలో ఏలాంటి ముఠాల సంచారం లేదు
* తప్పుడు ప్రచారం చేసే చర్యలు తప్పవు * కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టం

కరీంనగర్, మే 21: కొద్దిరోజులుగా వాట్సాఫ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో మనుషులను కిరాతకంగా చంపి, వారి మెదడును తినే ముఠాలు, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులను నమ్మవద్దని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో పెట్రేగిపోతున్న పుకార్లతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, అంతేకాకుండా కొన్ని వార్త పత్రికల్లో వీణవంక, జమ్మికుంట ప్రాంతాల్లో ఈ ముఠాలు సంచరిస్తుండటంతో గస్తీని ముమ్మరం చేశారంటూ కథనాలు వెలువడటం అవాస్తవమని, జిల్లాలో ఏలాంటి ముఠాల సంచారం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వేసవిలో అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసుల గస్తీని ముమ్మరం చేసినట్లు వివరించారు. మనుషులను చంపే అవయవాలు తినే ముఠాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా సంచరించిన దాఖలాలు లేవని, అటువంటి కేసులు ఎక్కడ నమోదు కాలేదని తెలిపారు. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన సంఘటనలో మతిస్థిమితం లేని వ్యక్తి బెంగాల్ రాష్ట్రంలో గల తమ తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పిపోయి ఆ గ్రామానికి చేరుకున్నట్లుగా గుర్తించామని, వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి అతన్ని వారికి అప్పగించినట్లు వెల్లడించారు. కొద్దిమంది పనిలేని పోకీరీలు వాట్సాఫ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, సంచలనం కోసం అలాంటి వాటిని ఫోస్ట్ చేయడం చేస్తున్నారని, అలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరుతూ, వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో ఇలాంటి పుకార్లను పోస్ట్ చేసే చర్యలు తప్పవని సీపీ ఆ ప్రకటనలో హెచ్చరించారు.