కరీంనగర్

‘పెట్రో’ వాతలు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 22: రోజువారి రేట్లతో చమురు సంస్థలు ఏర్పడకుండానే వాహనదారులకు వాతలు పెడుతున్నాయి. ఎండల మాదిరిగా పెట్రోల్, డిజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. పైపైకి ఎగబాకుతున్న ధరలతో సామాన్యులు బండి నడపడం గగనంగా మారుతోంది. రోజువారి రేట్లతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతుండగా, పైపైకి పోతున్న దరలు వారిని కలవరపెడుతున్నాయి. 2017 జూన్ 16 నుంచి అమలవుతున్న రోజువారి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల పాలిట శాపంగా మారింది. రోజు వారి రేట్లంటూ 5,10,15,20పైసల చొప్పున పెంచేస్తూ వాహనదారుల నడ్డి విరుస్తున్నారు. ఎంత పెరిగిందో కూడా అర్ధం కాని రీతిలో జనాల జేబులను ఖాళీ చేస్తున్నారు. రెండు నెలల కాలంలో పెట్రోల్‌పై దాదాపు రూ.10కిపైగా పెంచేశారు. డీజిల్ పరిస్థితి కూడా దాదాపుగా అదే పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 230కిపైగా బంకులుండగా, ప్రతీ బంకులో సగటున నిత్యం 1000 లీటర్ల వరకు పెట్రోల్, 3వేల లీటర్ల వరకు డీజిల్ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. 2017 జూన్ 16 నుంచి కేంద్ర సర్కార్ ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా రోజు వారి ధరలు నిర్ణయించుకునే అధికారం కట్టబెట్టడంతో రోజువారిగా ఎవరికి తెలియకుండా, ఏర్పడకుండా ధరలు పైపైకి పెంచేస్తున్నారు. నేడు (మంగళవారం) పెట్రోల్ లీటర్‌కు రూ.81.51, డీజిల్ రూ.74.06లకు చేరాయి. ఇలా జనాలకు అర్థం కాకుండా రోజు పది, ఇరవై పైసలు పెంచుతూ వాహనదారుల జేబులకు ఏర్పడుకుండానే చిల్లులు పెడుతుండగా, అటు ఏర్పడకుండానే అదనపు భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒకే దేశం..ఒకే పన్ను పేరిట సరికొత్త పన్ను జిఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టినా పెట్రోల్, డీజిల్‌ను మాత్రం ఆ జాబితాలోకి తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని ప్రజల నుంచి డిమాండ్ ఉన్నా..ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవు. ఏదిఏమైనా పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్యుడికి పెనుభారంగా మారాయి. పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ బంక్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.