కరీంనగర్

కమిషనరేట్‌లో పోలీసుల ఇఫ్తార్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 22: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీసు కమిషనరేట్ కేంద్రంలోని జాన్‌విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ థియేటర్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ విందులో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ అన్ని మతాల ప్రజలు సోదరభావంతో మెదులుతూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఉపవాస దీక్షల సందర్భంగా పాటించిన నియమాలు ప్రతినిత్యం అనుసరిస్తూ, తోటి వ్యక్తులకు తమవంతు సహాయం అందజేయాలని అన్నారు. శాంతియుత వాతావరణం నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ సర్వమతాల సారాంశం ఒక్కటే అన్న భావంతో మెదులుతూ, బడుగు, బలహీనవర్గాలకు చేయూతనందించాలని కోరారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సర్వమతాల ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తుండటం వల్లే శాంతియుత వాతావరణం నెలకొన్నదని, శాంతి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. శాంతి భద్రత పరిరక్షణ చర్యల్లో తమవంతు సహకారం అందిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్తార్ విందు అనంతరం ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, మున్సిపల్ కమిషనర్ శశాంక, అడిషనల్ డీసీసీ సంజీవ్‌కుమార్, ఎసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేష్‌గౌడ్, విజయకుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లతోపాటు పలువురు కార్పోరేటర్లు, ముస్లీం మతపెద్దలు, ముస్లీం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

అవార్డులతో ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందా?
* గ్రామ గ్రామాన భూ ప్రక్షాళన చేస్తేనే పరిష్కారం * జిల్లాలోనే 50శాతం తప్పులు..రాష్ట్రంలో ఇంకెన్నో
* సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మే 22: అవార్డులతో ప్రభుత్వం సరిగా నడుస్తుందంటే శుద్ధ తప్పేనని భూ విస్తర్ణం తగ్గించినందుకు ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారా? అని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ 99శాతం భూప్రక్షాళన చేశామని గొప్పలు చెప్పిన అధికారులు 50శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలన్నారు. తనకున్న 40ఎకరాల భూమికి రైతుబంధు క్రింద వచ్చిన రూ.1లక్షా 60వేలు చెక్కు బలవన్మరణం చెందిన రైతుల ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున అందిస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లాలో 2లక్షల పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా 1లక్షా 40వేలు పంపిణీ చేస్తే జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందా? గ్రామ గ్రామాన భూ ప్రక్షాళన చేస్తేనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. జిల్లాలో 50శాతం తప్పులే దొర్లాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని తప్పులు ఉన్నాయో ఇలాగే తెలిసిపోతుందన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలువడం అభినందనీయమే కాని 2లక్షల పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా 1లక్షా 40వేలు పంపిణీ చేస్తే ప్రథమ స్థానం నిలుస్తుందా? నమోదు కార్యక్రమం చాలా తప్పులే ఉన్నాయని ఎక్స్‌లెన్స్ అవార్డులు విస్తీర్ణం తగ్గించినందుకు ఇచ్చారా? 99శాతం భూప్రక్షాళన చేశామని 50శాతం పడిపోయినందుకు ఇచ్చారా..?ప్రభుత్వం తేల్చి చెప్పాలని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, కొలుగూరి దామోదర్‌రావు, ఎంపిపి గర్వందుల మానస, సారంగాపూర్ జడ్పీటీసీ బూక్య సరళ, వైస్ ఎంపీపీ గంగం మహేష్, రియాజ్, నేహాల్, రఘువీర్‌గౌడ్, మారు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.