కరీంనగర్

ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 19: అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని బాలికలపై కామాంధులు తెగబడి అత్యాచారాలు చేస్తూ హతమారుస్తుంటే కళ్లుండీ చూడలేని పాలకులు కళ్లు తెరిచి మానవమృగాల భరతం పట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బాలికలు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా సొన్‌లో స్పందన అనే బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటన నిరసిస్తూ మంగళవారం జగిత్యాల కొత్తబస్టాండ్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకొని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థిను లు వినూత్న తరహాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడే మానవమృగాలపై నిర్భయ చట్టం అమలు క్రింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కామాంధుల భారీ నుండి బాలికలకు రక్షణ కల్పించాలని లేకపోతే స్ర్తి జాతి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని కళ్లకు గంతలుకట్టుకొని నిరసన తెలిపిన విద్యార్థినులు వెల్లడించారు.