కరీంనగర్

రైతు బీమాలో జిల్లా నెంబర్‌వన్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 19: రైతు బీమా పథకంలో అర్హులైన రైతులందరిని చేర్పించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కోర్టులో పెండింగ్ ఉన్న భూముల కేసులను మినహాయించి మిగిలిన 18 నుంచి 60 సంవత్సరాలలోపు రైతులందరిని చేర్పించాలని సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వ్యవసాయశాఖతోపాటు అనుబంధ శాఖలైన మత్స్య, పశుసంవర్థక, పట్టు పరిశ్రమ, హార్టికల్చర్ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు జీవిత బీమా పథకంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 4లక్షల 18వేల 369 మంది రైతులను చేర్పించాలని అన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలకు కొరత లేదని, రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇప్పటివరకు రైతులు ఉమ్మడి జిల్లాలో పదిశాతం విత్తనాలు వేసారని, వర్షాలు పడితే సాగు విస్తీర్ణం పెరుగుతుందని అన్నారు. జిల్లాల వారీగా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి పంట రుణాల లక్ష్యాలను నిర్ణయించాలని ఆదేశించారు. అనారోగ్య సమస్యలకు కారణమయ్యే పందులను పట్టణాల నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్లకు దూరంగా తరలించి సోసైటీల ద్వారా పెంచుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పందులను దూర ప్రాంతాలకు తరలించాలని హైకోర్టు సూచించిందని, సిద్ధిపేట జిల్లాలో పందులను పూర్తి స్థాయిలో దూర ప్రాంతాలకు తరలించి పెంచుతున్నారని, అదే తరహాలో ఉమ్మడి జిల్లాలో సోసైటీలతో సంప్రదించి 20రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్‌ఎండి, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిపి దాదాపు 200 కిలోమీటర్ల పొడవునా నీటి వనరులు ఉన్నాయని, మత్స్య సంపదకు కొదవ లేదని, చేపల ఎగుమతి కేంద్రంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లాలోని బ్రోకర్ల వ్యవస్థను వందశాతం నిర్మూలించాలని తెలిపారు. చేపల పెంపకంపై 20 శాతం పెట్టుబడి పెడితే వంద శాతం రాబడి వస్తుందని, ఇది మంచి ఆదాయ వనరులని అన్నారు. ఉమ్మడి జిల్లాలో పండ్ల తోటలకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈత, తాటి వనాలకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. వచ్చే హరితహారంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎకరం, ఆపైన భూమి ఉన్న చోట మొక్కలు నాటించి, వాటికి డ్రిప్ మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పట్టు పురుగుల పెంపకం ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్లు కృష్ణ్భాస్కర్, శరత్, దేవసేన, పెద్దపల్లి ఎంపీ సుమన్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, ఐడిసి చైర్మన్ శంకర్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అక్భర్ హుస్సేన్, అధికారులు పాల్గొన్నారు.