కరీంనగర్

ఉత్కంఠకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 13: సర్పంచుల పదవీ కాలం చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ప్రస్తుత సర్పంచ్ గడువును పొడగించనుందా ? లేక ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టనుందా ? అన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా..రిజర్వేషన్ల అంశం కోర్టు గడప తొక్కడంతో ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలున్న క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,211 గ్రామ పంచాయితీలుండగా, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు అంతా సిద్ధం చేసారు. ఎన్నికలు నిర్వహించడమే తరువాయి ఉండగా, రిజర్వేషన్ల అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రీయకు బ్రేక్ పడినట్లయింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వ నిర్ణయం ఏలా ఉండబోతోందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత పాలకవర్గాల గడువు పొడగిస్తుందా? లేక ప్రత్యేక అధికారుల వైపు మొగ్గు చూపుతుందా? అనే అంశంపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొనగా, ఆ ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంతవరకు ప్రత్యేకాధికారులను నియమించుకోవచ్చు. గతంలో 2011 జూన్‌లో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియగా, ఎన్నికలు జరగకపోవడంతో అప్పటి ప్రభుత్వం 2013 ఆగస్టు వరకు ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగించింది. ఈసారి కూడా అదే పరిస్థితులు ఉండటంతో ప్రభు త్వం ప్రత్యేకాధికారుల పాలన వైపు మొగ్గు చూపింది. సర్పంచుల పదవికాలం ముగిసిన రోజునే ఆగస్టు 1 నుంచి స్పెషలాఫీసర్లు పాలన బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలై చివరి వారంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తక్కువ గ్రామాల్లో గెలువగా, 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో పూర్తిగా ఆ సీన్ మారిపోయింది. పలు పార్టీల్లో కొనసాగుతున్న సర్పంచ్‌లు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది సర్పంచులు టీఆర్‌ఎస్ వారే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రీయకు బ్రేకులు పడటంతో సర్పంచులు తమ పదవీకాలాన్ని పొడగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో వారిలో నిరాశ అలుముకుంది. అయితే, ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనకు యంత్రాంగం అంతా సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 1 నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలు ఆగస్టు 2న ఆవిష్కరణ కానున్నాయి.
కొత్త పంచాయితీల్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తానికి ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గుచూపడంతో పాత, కొత్త గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక పాలన కొనసాగనుండగా, ప్రభుత్వ నిర్ణయం సర్పంచులను నిరాశపర్చింది.