కరీంనగర్

రాష్ట్రంలో గాడితప్పిన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, జూలై 14: రాష్ట్రంలో ఏక వ్యక్తి పాలన సాగుతూ పరిపాలన గాడితప్పిందని సీఎల్పీ ఉపనేత,జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. శనివారం సారంగాపూర్ మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు ఎవరూ విధా న నిర్ణయాలు తీసుకోకుండా కేవలం సీఎం మాత్రమే నిర్ణయాలు తీసుకుం టూ ప్రభుత్వాన్ని కుంటుపడే విధంగా మార్చేశారన్నారు. 18 నుంచి 59యేళ్లు గల రైతులకే రైతు బీమా అమలు చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరకుండా పోయిందన్నారు. జిల్లా లో 1.10లక్షల రైతులు ఉంటే వారిలో 18 నుంచి 60యేళ్ల అర్హత నిర్ణయించ డం ద్వారా ఆపైన వయస్సు గల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కూలీలకు, కౌలుదారులకు అందరికీ బీమా వర్తింపజేయాలన్నారు. గ్రామాలల్లో వ్యవసాయ కూలీ లు 90శాతం బడుగు, బలహీన వర్గాలకే చెందిన వారు ఉన్నారని, వారికి బీమా కల్పించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనం అందే అవకాశం ఉందన్నారు. రికార్డుల శుద్ధీకరణలో ప్రభు త్వం విఫలమైందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. అధికారుల పనితీరుపై సీఎం కేసీఆర్ కూడా ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి గుర్తు చేశారు. రైతులకు గతంలో పట్టే దారుపాసుబుక్‌లు, టైటీలు డీడీలు ఇవ్వగా ప్రస్తుతం పట్టాదారుపాసు బుక్‌లే ఇచ్చి టైటీలు డీడీలు ఇవ్వకపోవడం వల్ల రై తుల భూమి పూర్తిస్థాయిలో పొందుపర్చలేక భూయాజమాన్య హక్కులు కోల్పోతున్నారని విమర్శించారు. ప్రస్తు తం అందించిన పాసుబుక్కుల్లో పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని నమోదుచేసే విధం గా ఆదేశాలు జారీచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భూక్య సర ళ, మస్తరి రమేష్, కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణరెడ్డి, ఎదులాపురం లింగయ్య, ఏలేటి లక్ష్మారెడ్డి, తదితరులున్నారు.

కారు, బైక్ ఢీ : వ్యక్తికి తీవ్రగాయాలు
కరీంనగర్ రూరల్, జూలై 14: కరీంనగర్ రూరల్ మండలం నగునూరు వద్ద శనివారం కారు, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయాణీస్తున్న చామనపల్లి గ్రామ పరిధిలోని దుబ్బపల్లిలో నివసిస్తున్న ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కౌ టాల మల్లేష్ (30) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.

కళాశాల ఎదుట ఏబీవీపీ ధర్నా
జగిత్యాల టౌన్, జూలై 14: జగిత్యాల ఎస్సార్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం సర్ట్ఫికెట్లు ఇవ్వక పోవడంతో శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి పట్టణ సిఐ ప్రకాష్‌కు, కాలేజీ యాజమాన్యానికి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు రెంటం జగదీష్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలోని వెనె్నల డిగ్రీ కళాశాల యాజమాన్యం కళాశాల నిర్వహించలేక జగిత్యాలలో ఉన్న ఎస్సార్‌ఆర్ డిగ్రీ కళాశాలకు అప్పగించారని, ఇందులో డిగ్రీ చదువు తున్న 2015-18బ్యాచ్ విద్యార్థులు ఎస్సార్‌ఆర్ కళాశాలలో చదువును పూర్తి చేశారన్నారు. పూరైన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు ఇవ్వకపోవడం బాధకరమన్నారు. కళాశాలల ఆర్థిక లావాదేవీలే కారణమని ఆరోపించారు. వెంటనే సర్ట్ఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చింత అనిల్, రాజుసాగర్, జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్, వినీత్, ప్రశాంత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.