కరీంనగర్

చట్టాలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూలై 14: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని పెద్దపల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పట్ట్భారామా రావు పేర్కొన్నారు. మండలంలోని రంగంపల్లి గ్రామంలో గల సబ్‌కోర్టు ఆవరణం లో శనివారం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చట్టాల గురించి తెలిసినప్పుడే ఏదైన సమస్య వచ్చినప్పుడు సరైన పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత న్యాయ సేవలు అందించడానికి మండల న్యాయ సేవా అధికార సంస్థ పని చేస్తుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల న్యాయ సేవా అధికార సంస్థ పని చేస్తుందన్నారు. మహిళల కోసం కొత్త చట్టాలు రూ పొందించారని, వాటి గురించి తగిన న్యాయం పొందాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను చట్ట ప్రకారం అనుభవించాలంటే చట్టాలపై కనీస అవగాహన అవసరమన్నారు. అందుకే మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఎసీపీ హబీబ్‌ఖాన్, సీఐ గోపతి నరేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వెంకటరమణా రెడ్డి, న్యాయ వాదులు వీ.తిరుపతి రావు ,తదితరులు పాల్గొన్నారు.

దళిత సమస్యల సాధన కోసం..
దండులా కదులుదాం
* తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్
జగిత్యాల, జూలై 14: దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యల సాధన కోసం అందరూ ఏకతాటిపై కదం తొక్కి కదలాల్సిన అవసరం ఉందని తెలంగాణ అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు బిరుదుల లక్ష్మణ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అంబేడ్కర్ సంఘ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దళితులు రాజకీయ హక్కులను సాధించుకునేందుకు రాజీలేని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక అంబేడ్కర్ సంఘ భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ప్రణాళిక రూపొందించామని లక్ష్మణ్ తెలిపారు. ఈదెల్లి శంకర్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బత్తిని అరుణ, ఇరుగురాళ్ల ఆనంద్, బాలె శంకర్, బెజ్జంకి నరేష్, నర్సింగ్, కొత్తూరి తిరుపతి, చెప్యాల రాములు పాల్గొన్నారు.

అదుపుతప్పి బావిలో పడ్డ లారీ
* క్షేమంగా బయటపడిన డ్రైవర్
కరీంనగర్ రూరల్, జూలై 14: రూరల్ మండలం తీగలగుట్టపల్లి ఆరెపల్లి రహదారి రోడ్డుకు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి శనివారం ఓ లారీ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లగా, లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. ధర్మారం మండలం పత్తిపాక నుండి విద్యుత్ స్థంబాల లోడ్‌ను గంగాధర మండలం మల్లాపూర్‌కు తరలిస్తుండగా, తీగలగుట్టపల్లిలోని ఎల్లమ్మగుడి వద్ద ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయిన క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. లారీ పడిన దృశ్యాన్ని చూసిన స్థానికులు మునిగిపోతున్న లారీలో నుంచి డ్రైవర్‌ను కాపాడారు. ఈ విషయం తెలుసుక్ను పోలీసులు, మండల తహశీల్ధార్ రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి వచ్చి స్వల్పగాయాలతో బయటపడిన డ్రైవర్ జగన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామస్తులు బత్తిని నరేష్, నగేష్‌లు మాట్లాడుతూ గతంలో కూడా ఇక్కడ రెండుసార్లు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఆరెపల్లి, రేకుర్తి రహదారికి అనుకొని ఐదు వ్యవసాయ బావులు ఉన్నాయని, కొంతమంది రైతులు బావి చుట్టు రక్షణ గోడలు నిర్మించుకున్నారని, ఇంకా కొంత మంది గోడలు నిర్మించలేదని తెలిపారు. ఈ రహదారిపై వాహనాల రద్ది పెరిగిందని, గత రెండు నెలల క్రితం లారీ అదుపుతప్పి విద్యుత్ స్థంబాన్ని డీ కొట్టడంతో విద్యుత్ వైర్లు తెగిపడి సుమారు 50 ఇండ్లలలో గృహోపకరణాలు దగ్ధమయ్యాయని తెలిపారు. రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి మీదుగా భారీ వాహనాలు రాకుండా పోలీసులు, రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.