కరీంనగర్

రైతు కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూలై 14: మండల పరిధిలోని పచ్చునూర్ గ్రామానికి చెం దిన గోపు ధర్మారెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘం ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మృతుడు ధర్మారెడ్డి కుటుంబాన్ని సంఘం సభ్యులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్థులకు కుల వృత్తిలేకపోవడంతో జీవన ఉపాధి కోసం వ్యవసాయాన్ని నమ్ముకొన్ని జీవిస్తుంటే రైతులు ప్రమాదవశాత్తు మృతిచెందింతే వారి కుటుంబం రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బండ గోపాల్‌రెడ్డి, కర్ర గోపాల్‌రెడ్డి, కేశవరెడ్డి, రాజిరెడ్డి, గోపు శ్యాంసుందర్ రెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, గోపు మహిపాల్‌రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి, జూలై 14: వర్షాలు సకాలంలో కురవాలని, వేసిన విత్తనాలు మొలకెత్తాలని, రైతన్నలకు ఆత్మస్థయిర్యం కల్పించాలని, ధర్మపురి క్షేత్రంలో వరుణుని కటాక్ష వీక్షణాలు సోకాలని కోరుతూ ప్రత్యేక దైవ పూజలు నిర్వహించారు. అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయ ఆచరణలో భాగంగా క్షేత్రంలోని పురాతనమైన శ్రీరామానందేశ్వర ఆలయంలో వానలు కురవాలని ప్రార్థిస్తూ జలాభిషేకం నిర్వహించారు. శనివారం ప్రారంభ దినం నాడు నిర్వాహక కమిటీ బాధ్యులు యాజ్ఞికులు సంగనభట్ల కిషన్ శర్మ ఆధ్వర్యంలో మునుముందుగా అభిషేక ప్రియుడైన శంకరునికి, గోదావరి నది నుంచి బిందెలతో పవిత్ర నదీ జలాలను కొనితెచ్చి సంతద్ధారగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని వేదోక్త సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. వేదవిదులైన ఇందారపు లక్ష్మీకాంత శర్మ, మధ్వాచారి రాంకిషన్, రావులపెల్లి వెంకటరమణ శర్మ, కాకెర్ల లక్ష్మీకాంతం శర్మ, కొరిడె బాలకృష్ణ శర్మ, గొల్లపెల్లి కృష్ణ, ఒజ్జల లింగన్న, పాలెపు రాంచందర్, కొరిడె అమర్, నారంభట్ల ప్రశాంత్, సంగనభట్ల శ్రీనివాస్, పణతుల బండయ్య, బావి మురళి, బల్యపెల్లి ప్రసాద్ శర్మ, సంగనభట్ల శ్రీకాంత్ ఆచార్యత్వంలో పూజలు నిర్వహించారు.

16న సిరిసిల్లలో కేటీఆర్, నాయిని పర్యటన
సిరిసిల్ల, జూలై 14: రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈనెల 16 రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డితో కలిసి పర్యటిస్తున్నారు. ఈమేరకు సోమవారం ఉదయం తంగళ్ళపల్లి మండలం మండెపల్లిలో ప్రభుత్వ ఐటీఐ భవనంను శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఉదయం 11.00 గం.లకు మండెపల్లి చేరుకుని ఐటీఐ భవనంకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12.00 గం.లకు మండెపల్లి నుండి హైదరాబాద్‌కు తిరిగి వెలుతారు. అయితే తొలుత సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నివేశన స్థలాల పట్టా సర్ట్ఫికెట్ల పంపిణీ ఉండగా పర్యట నుంచి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కేవలం మండెపల్లిలో ఐటీఐ భవన శంకుస్థాపన వరకే కార్యక్రమం పరిమితం చేశారు.