కరీంనగర్

ఏసీబీ, విజిలెన్స్‌కి ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, జూలై 14: మానేరు వాగుపై కడుతున్న చెక్‌డ్యామ్ పనుల్లో నాణ్యత లోపించడంతో చెక్‌డ్యామ్ కింద నుంచి నీరు ప్రవహిస్తోందని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అవినీతికి పాల్పడుతున్నారని, దీనిపై ఎసీబీ, విజిలెన్స్ స్వతంత్ర సంస్థలతో విచారణకు ఫిర్యాదు చేస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మికుం ట మండలంలోని విలాసాగర్ మా నేరు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపించి, నిర్మాణం చేసిన పనుల కింద నుంచి నీళ్లు రావడాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మానేరు వాగుపై నిర్మాణం చేపట్టే పనులలో నీళ్లు వస్తాయని తెలిసి, మీద మీద కట్టారని, పనులను కప్పి పుచ్చడానికి ఇసుక వేస్తున్నారని, ఈ ప్రభుత్వం అవినీతి నీళ్ల రూపంలో బయటకు వస్తున్నాయని ఆరోపించారు. గతం లో నందిమేడారం మండలంలో ధర్మా రం గ్రామంలో ప్రాణహిత, చేవెళ్ల అనుబంధంగా చేసిన చెరువు పనులు నాణ్యత లోపించి కుప్పకులాయని, అదే పరిస్థితి మానేరు చెక్ డ్యామ్‌కు పడుతుందన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పుకునే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రుల నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా గ్రామంలోని మాజీ స ర్పంచ్ కనపర్తి సంపత్‌రావుతో పాటు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 100 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, జిల్లేల తిరుపతిరెడ్డి, సుంకరి రమేష్, గుడెపు సారంగపాణి, కసుబోజుల వెంకన్న, సాయిని రవి, దిలీప్, పర్లపల్లి రమేష్, మొలుగూరి సదయ్య, చంద్రగిరి శ్రీనివాస్, యండీ సలీమ్, నాగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు.

వైద్యుల కొరత వల్లే మాతా, శిశు మరణాలు
* బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి స్వామి
కరీంనగర్ టౌన్, జూలై 14: గత కొద్దిరోజులుగా జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న పసిపిల్లలు, బాలింతల మరణాలకు వైద్యుల కొరతే కారణమని బీజేపి జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి ఆరోపించారు. వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారించి, పేద,మద్య తరగతి ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రంలోని ప్రధాన వైద్యశాలతోపాటు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలోవైద్యులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైద్యంపై ఎన్నో ఆశలతోజిల్లాతోపాటు పరిసర జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు, గర్భిణీ స్ర్తిలు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వివిధ పరీక్షల నిమిత్తం వస్తుండగా, నామమాత్రపు వైద్య చికిత్సలతోరోగుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునిక వసతులతోవైద్యశాలలు నిర్మించినా, వైద్యుల నియామకం చేపట్టకపోవటంతో ఆస్పత్రిలో రోజుకో మరణం షరామామూలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్యుల నియామకం చేపట్టాలని, లేనిపక్షంలోబీజేపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.