కరీంనగర్

ఎస్సారెస్పీ కార్యాలయ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, జూలై 17: కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా ఎల్‌ఎండి రిజర్వాయర్‌లోకి నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్‌ఎండి కాలనీలో గల ఎస్సారెస్పీ సీఈ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముట్టడించారు. ముందుగా ఎస్సారెస్పీ అతిథి గృహం నుండి రాజీవ్ రహదారి మీదుగా ఎస్సారెస్పీ సీఈ కార్యాలయం వరకు ర్యాలీ తీసారు. సీఈ కార్యాలయం ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఎండకడుతూ నినాదులు చేశారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ప్రసంగించారు. అనంతరం జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లంపల్లి నుంచి ఎల్‌ఎండీలోకి వరద కాలువ ద్వారా తరలించి తాత్కాలికంగా నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎల్‌ఎండి కెపాసిటీ మేరకు నీటిని కాళేశ్వరం ద్వారా నింపుతూ శాశ్వత పరిష్కారం కోసం డీపీఆర్‌లో రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. జిల్లాకు సాగునీటిని అందించిన తరువాతే ఇతర జిల్లాలకు తరలించాలని అన్నారు. ఎల్‌ఎండి రిజర్వాయర్‌ని ప్రస్తుతం ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించి డిమాండ్ చేస్తూ ఈ ముట్టడికి పూముకున్నట్లు తెలిపారు. నీళ్ళు, నిధులు, నియామకాలపై ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో నీళ్ల దోపిడీ జరుగుతుందని ఆయన ఆరోపించారు. సిద్దిపేటకు నీరు తీసుకెళ్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎల్లంపల్లి నీటిని మిడ్ మానేర్ ద్వారా సిద్దిపేటకు తీసుకెళ్లేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని, దీనిపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదని అన్నారు. సిద్దిపేట కంటే ముందే తాత్కాలికంగా ఎల్లంపల్లి నుంచి ఎల్‌ఎండిలోని నీటిని నింపాలన్నారు. ఆ తరువాత మిడ్ మానేర్ ద్వారా గౌరవెల్లి, గండిపల్లికి తరలించాలని కోరారు. శాశ్వత పరిష్కారం కోసం కాళేశ్వరం నీటితో ఎల్‌ఎండి నింపేందుకు డిపీఆర్‌లో ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగం పక్షాన పార్టీ నిలిచి ఉద్యమిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను రైతులు నిలదీస్తారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల అంజేనేయులు, కొర్వి వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కనుమల్ల గణపతి, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు హరికుమార్ గౌడ్, సాయని మల్లేశం, గాజుల స్వప్న, జేరిపోతుల శంకర్, గంగడి కృష్ణారెడ్డి, కొట్టె మురళి, జిల్లా అధికార ప్రతినిధులు జానపట్ల స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారావు, నాయకులు పాల్గొన్నారు.
ముందస్తు పోలీసుల భారీ బందోబస్తు
భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎండిలోని ఎస్సారెస్పీ సీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్న విషయాన్ని గమనించిన తిమ్మాపూర్ సర్కిల్ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎల్‌ఎండి ఎస్సై నరేష్‌రెడ్డి, చిగురుమాడి, స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు.