కరీంనగర్

సమర్థవంతంగా కేంద్ర పథకాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా అభివృద్ధి, సమన్వయ మానిటరింగ్ కమిటీ కో-చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు. పథకాల అమలు, జాప్యంపై సమస్యలుంటే ప్రజాప్రతినిధులకు తెలిపితే, ఆ సమస్యను హైదరాబాద్‌లో పైఅధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే యత్నం చేయడంతోపాటు మంజూరు ఉత్తర్వులు విడుదలయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించి, ఎజెండాలోని అంశాల వారీగా అన్ని శాఖల పథకాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని, అప్పుడే వందశాతం పథకాలు అమలవుతాయని అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో రైతులందరికీ పెట్టుబడి సాయం చెక్కులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు వారివారి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని శ్మశాన వాటికలకు మిషన్ భగీరథ పైపుల ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్మశాన వాటికలో బోర్లు వేయకూడదని ఆదేశాలు ఉన్నందున నేపథ్యంలో బోర్లు మంజూరు చేయడం లేదని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా శ్మశాన వాటికలకు నీరు సరఫరాకు తగిన ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎలగందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరిందని, దానిని కూల్చివేసి కొత్త పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే ముంపు గ్రామమని మంజూరు కావడం లేదని సమావేశం దృష్టికి తీసుకురాగా, లక్ష్మికాంతారావు జిల్లా విద్యాధికారిని వెంటనే వెళ్లి తనిఖీ చేసి కొత్త పాఠశాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కరీంనగర్ నగరంలో మురుగు నీరు నిల్వ ఉంటుందని, ఆ నీటిని తొలగించాలని, మురుగునీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలని, స్ప్రే చేయాలని ఎమ్మెల్యే కోరగా, యుద్ధప్రాతిపదికన పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో డాక్టర్లు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద జిల్లాలో రోడ్ల ప్రతిపాదనలు పంపే ముందు ఎమ్మెల్యేల ఆమోదం తీసుకుని పంపాలని లక్ష్మికాంతారావు సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ కస్తూర్భా గాంధి బాలికల విద్యాలయాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని, మంచి పౌష్టికాహారం ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులన్ని పాఠశాలల నిర్వహణకు, టీచర్ల జీతాలకు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, అయితే, తాము పాఠశాలను సందర్శించినప్పుడు తమకు జీతాలు రావడం లేదని టీచర్లు ధరఖాస్తులు ఇస్తున్నారని అన్నారు. నిధులు లేక జీతాలు పెండింగ్‌లో ఉన్నాయా అని అధికారులను లక్ష్మీకాంతారావు అడిగారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ్ధర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణతో నేత కార్మికులకు మెరుగైన ఉపాధి
* చేనేత..జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర్‌రావు
సిరిసిల్ల, జూలై 17: శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, నాణ్యమైన చేనేత వస్త్రాలైన లెనిన్ షర్టింగ్, పంజాబి డ్రెస్ మెటేరియల్ మొదలైన రకాలు ఉత్పత్తి చేసి మెరుగైన ఉపాధి పొందాలని చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు డి.వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం సిరిసిల్ల, రాజీవ్‌నగర్‌లలోని చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ తరగతులను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్లాక్ లెవల్ క్లస్టర్ కింద చేనేత శిక్షణ కార్యక్రమాన్ని చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. చేనేత కార్మికులకు నేతలో నైపుణ్యం కల్పించడం, 45 రోజుల పాటు జరిగే శిక్షణలో ప్రతీ కార్మికుడికి శిక్షణ కాలంలో రోజుకు రూ.210ల చొప్పున ఉపకార వేతనాలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ వి.అశోక్‌రావు, హైదరాబాద్ చేనేత సేవ కేంద్రం అధికారి వేణుగోపాల్‌రావు, అభివృద్ది అధికారి, సహాయ అభివృద్ది అధికారులు ఎంఎ.రశీద్, ఎంఎ అజహార్ వహాబ్, మహేశ్వర చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు దూసరాజయ్య, ఆడెపు భాస్కర్, వేములవాడ చేనేత పారిశ్రామిక సంఘం మేనేజర్ రాజేశం, మామిడిపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు.