కరీంనగర్

2 గంటలపాటు టెన్షన్ .. టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లాపూర్, జూలై 19: మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బెజ్జారపు లింబాద్రి తన 32గుంటల భూమిని విరాసత్‌కు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు చేయకపోవడంతో గురువారం విద్యుత్ స్తంభమెక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బాధితుడి కథనం ప్రకారం రెండుమాసాల నుంచి మండల రెవెన్యూ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేసినా పట్టించుకునే అధికారులే కరువయ్యారన్నారు. గతంలో పనిచేసిన వీఆర్‌ఓకు పలుమార్లు మొరపెట్టుకున్నా పూర్తిచేస్తామని చెబుతూ దాటవేశారని దీంతో మనస్తాపం చెంది చావే శరణ్యమని భావించి గత్యంతరంలేక విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించానన్నారు. ఈ మధ్యనే బదిలీపై వచ్చిన వీఆర్‌ఓ ఆంజనేయులు 10 రోజుల్లో విరాసత్ ప్రోసిండింగ్ కాపీని అందిస్తానని హామీ ఇవ్వడం తో స్తంభంపై నుండి దిగి వచ్చినట్లు బాధితుడు లింబాద్రి వెల్లడించారు. లింబాద్రి విద్యుత్ స్తంభం ఎక్కడంతో రెండుగంటపాటు టెన్షన్ నెలకొనగా వీఆర్‌ఓ హామీతో లింబాద్రి స్తంభంపై నుంచి కిందికి దిగిరావడంతో కథ సుఖాంతమైంది.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే రసమయి
గనే్నరువరం, జూలై 19: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం మండలంలోని హన్మాజిపల్లిలో అంగన్‌వాడీ భవనం, రెడ్డి సంఘం భవనం ప్రారంభించా రు. అనంతరం మాట్లాడుతూ రైతు లేని రాజ్యం లేదని, రైతు సంక్షేమాని కి రాష్ట్రప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని, తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రైతులకు రుణ మాఫీ, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అదజేస్తున్నామన్నారు. కుల వృత్తుల వారికి రైతులు ఆధారం అన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. హన్మాజిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌కు రూ. 10,000 సీఎం రిలీఫ్ పండ్ చెక్కును అందజేశారు. ఎంపీపీ ఒగ్గు దామోదర్, జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డీనేటర్ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్టినేటర్ బోడ మాధవ రెడ్డి, లంగాల మల్లారెడ్డి, సర్పంచులు జువ్వాడి మన్ మోహన్ రావు, బద్దం తిరుపతిరెడ్డి, రమేశ్ బాబు, బొడ్డు సునీల్, అల్వాల్ కోటి, కాంతాల విక్రం రెడ్డి, తహశీల్దార్ జయంత్ పాల్గొన్నారు.