కరీంనగర్

ఆరోగ్యవంతమైన బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తారు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 19: సంపూర్ణ ఆరోగ్యవంతులైన బాలికలు అన్ని రంగాలలో రాణిస్తారని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బిఎన్‌ఆర్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిషన్ పింక్ హెల్త్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలోని అధిక మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇందుకు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమే కారణమని తెలిపారు. 10-20 సంవత్సరాలలోపు బాలికలు కూడా ఐరన్ లోపం కారణంగా చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పౌష్టికాహారంతో కూడిన పండ్లు, పాలు, ఆకుకూరలు, మాంసం వంటి ఆహార పదార్థాలను బాలికలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. బాలికలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే చదువుతోపాటు ఇతర రంగాలలో కూడా రాణిస్తారని తెలిపారు. మిషన్ పింక్ హెల్త్ మంచి కార్యక్రమమని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికలకు ఐరన్ మాత్రలను పంపిణీ చేశారు. బీఎన్‌ఆర్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.రావుతోపాటు పలువురు డాక్టర్లు ప్రవీణ్ కుమార్, జాన్సీ, వెంకటరెడ్డి, విజయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ హెల్పర్ కుటుంబాన్ని ఆదుకోవాలి
* మాజీ విప్ ఆరెపల్లి మోహన్ డిమాండ్
ఇల్లంతకుంట, జూలై 19: గత రెండు రోజుల క్రితం మండలంలోని గాలిపెల్లి గ్రామ అసిస్టెంట్ హెల్పర్ తిరుపతి రెడ్డి ప్రమాదవశాత్తున విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం మృతుని కుటుంబం రోడ్డున పడకముందే ఆదుకోవాలని ఆయన కోరారు. మాజీ విప్ ఆరెపల్లి మోహన్‌తో పాటు జిల్లా రైతు సెల్ అధ్యక్షుడు పాశం రాజేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయుకులు, తదితరులు ఉన్నారు.