కరీంనగర్

టీజేఎస్ యువజన విభాగం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 19: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తెలంగాణ జన సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. గంటకు పైగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న టివైఎస్ జిల్లా అధ్యక్షుడు మోరె గణేశ్ మాట్లాడుతూ, అధికారం చేపట్టి నాలుగేళ్ళు గడిచినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఉద్యోగ నియామకాలు ప్రకటించకపోవటం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు చల్లుతోందని విమర్శించారు. వెంటనే జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యువజన నాయకులు కర్రె సతీష్, అఖిల్‌రెడ్డి, కత్తి శివ, వన్నారం అక్షయ్, రామకృష్ణ, అంజనేయులు, రాకేశ్, ప్రణయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం
గనే్నరువరం, జూలై 19: మండల కేం ద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాకలివానిపల్లిలో గురువారం హరితహారం నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 500 మొక్కలు నాటారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ మొక్కలు నాటి అలా వదిలి వేయడమే కా కుండా వాటిని సంరక్షించాలని కోరారు. కా ర్యక్రమంలో సర్పంచ్ జువ్వాడి మన్ మోహన్‌రావు, పారువెల్ల సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సభ్యులు బూర శ్రీనివాస్, బాలరాజు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛసర్వేక్షణ్ పనులు పూర్తిచేయాలి
* ఎన్‌సీఆర్ కన్సల్టెంట్ జునైద్ అహ్మద్ ఉస్మానీ
పెద్దపల్లి, జూలై 19: స్వచ్ఛ్భారత మిషన్‌లో భాగంగా ప్రారంభించిన స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కేంద్రప్రభుత్వ ఎన్‌సీపీ గ్రామీణ తాగునీరు పారిశుద్ధ్యం శాఖ ప్రతినిథి జునైద్ అహ్మద్ ఉస్మానీ అన్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలు, కమిషనర్లు, స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ అధికారులు గురువారం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో ప్రతినిథి మాట్లాడుతూ ఈఏడాది ఆగష్టు నెలాఖరు వరకు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ్ సర్వేక్షణ గ్రామీణ పనులు పూర్తిచేయాలని తెలిపారు. కేంద్ర అధికారులు జిల్లాలోని గ్రామాలలో పర్యటించి పనులు పరిశీలిస్తారని, మంచి ప్రదర్శన కనబర్చిన జిల్లాను గుర్తించడం జరుగుతుందని కేంద్ర ప్రతినిథి తెలిపారు. గ్రామాలలో జరిగిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ పనులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని దీనికి 35శాతం వెయిటేజ్ ఉంటుందని అన్నారు. గ్రామాలలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వారసంతలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను పరిశీలిస్తుందని, అక్కడ నీటి, మరుగుదొడ్డి లభ్యత, వాటి వినియోగాన్ని బట్టి ఆ 30శాతం వెయిటేజ్ ఉంటుందని, కేంద్ర అధికారుల బృందం పర్యటించే ముందే పనులు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిథి ఆధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించుకున్నామని, గ్రామాలలో పారిశుద్ద్యంపై అధిక శ్రద్ద చూపుతున్నమని, కేంద్ర బృందం పర్యటనకు 45 రోజుల సమయం ఉన్నందున ఆసమయాన్ని ఉపయోగించుకోని గ్రామాలను మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామాలలో ప్రతి ఒక్కరు నూరుశాతం మరుగుదొడ్డి ఉపయోగించేలా అవగాహన చర్య లు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్డీవో ప్రేమ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అ.ని.శాను నిర్వీర్యం చేస్తే సహించం: సీపీఐ
కరీంనగర్ టౌన్, జూలై 19: అవినీతి నిరోధక శాఖ చట్టంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండటం, ఆ శాఖను నిర్వీర్యం చేసేందుకేనని, అదేగనుక జరిగితే సహించబోమని భారత కమ్యూనిస్టు పార్టీ నగర శాఖ కార్యదర్శి పైడిపల్లి రాజు హెచ్చరించారు. ఏసీబీ, సీఐడీ చట్టాల్లో మార్పులు చేస్తే రాష్ట్రంలో అవినీతికి అవధుల్లేకుండా పోతుందని, ఆదాయానికి మించి అక్రమాస్థులు ఆర్జించిన అధికారులు, ప్రజాప్రతినిధులైనా క్షమించవద్దని సూచించారు. చీఫ్ ఇంజనీర్ అక్రమాస్థుల కేసులో పట్టుబడితే, స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని, చట్టంలో మార్పులు చేస్తామని పేర్కొనటం శోచనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఎదుటే నిస్సిగ్గుగా కేసీఆర్ ఇలా మాట్లాడటం చూస్తుంటే అవినీతిపరులను ప్రోత్సహించటం కాదా అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి బట్టబయలవుతుందనే భయంతోనే ఏసిబి చట్టాలు మార్చేయత్నమన్నారు. భవిష్యత్‌లో ఏసీబీ దాడులు జరుగకుండా అనిశాకు కళ్లెం వేయాలని చూడటం దుర్మార్గమన్నారు.
వేతనాలు పెంచకపోవటం సిగ్గుచేటు
కరీంనగర్ టౌన్, జూలై 19: గ్రామాలను పరిశుభ్రతకు ఆయువుపట్టైన గ్రామపంచాయితీ కార్మికులకు వేతనాలు పెంచకపోవటం సిగ్గుచేటని జీపీ ఉద్యోగ, కార్మికుల ఐక్య కార్యచరణ సమితి విమర్శించింది. ఐకాస ఉమ్మడి జిల్లా సదస్సు గురువారం నగరంలోనిర్వహించగా, ఆయా సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ, జిపి కార్మికులకు వేతనాలు పెంచాలని కోరితే, స్థానిక సంస్థలతో సంబంధంలేదంటూ చేతులు దులుపుకోవటం రాష్ట్ర ప్రభుత్వం దగాకోరు తనానికి నిదర్శనమన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాల మాదిరి జీపీ కార్మికులను క్రమబద్ధీకరిస్తూ, వేతనాలకు ప్రభుత్వమే గ్రాంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్‌కలెక్టర్‌లను పంచాయితీ కార్యదర్శులుగా నియమిస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమల్లోకి తేలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ఈనెల 23నుంచి జరుగబోయే గ్రామపంచాయితీ కార్మికుల సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమ్మెలోకి వెళ్తున్నట్లు ఈనెల 21నుంచే అన్ని గ్రామాల్లో డప్పు చాటింపుచేయాలని సూచించారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, అధ్యక్షుడు యు.శ్రీనివాస్, కొప్పుల శంకర్, టీఆర్‌ఎస్‌కేవి బొల్లం శ్రీనివాస్, వెంకటేశ్, ఐఎఫ్‌టియు జిల్లాకార్యదర్శి జిందం ప్రసాద్, నరేశ్, ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, అన్ని సంఘల నాయకులు ఆగంరావ్, అన్నల్‌దాస్ గణేశ్, రఘుపతిరావు, రామానుజం, రవీందర్, మహిపాల్, కనకమ్మ, లక్ష్మి, తదితరులతో పాటు 250 మంది పాల్గొన్నారు.
జైనాలో వైభవంగా బోనాలు
ధర్మపురి, జూలై 19: ధర్మపురి మండలంలోని జైనా గ్రామంలో గురువారం స్థానిక పద్మశాలి సంఘం, మున్నూరు కాపు సంఘం, కుమ్మరి సంఘం, మేదరి సంఘం, మేదరి సంఘాల ఆధ్వర్యంలో కుల దేవతయైన పోచమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యాకులైన భక్తులు, ముఖ్యంగా మహిళలు, బోనాలతో, డప్పుల చప్పుళ్ళ మధ్య ఊరేగింపు నిర్వహించి, పోచమ్మకు ప్రీతికరమైన తీపి వంటకాలు, మట్టి, ఇత్తడి పాత్రలలో నివేదనలు తెచ్చి, సమీప పురాతన ఆలయం వద్ద ప్రత్యేక పూజలొనరించి, కట్న కానుకలను పెద్దమ్మ వద్ద ఉంచారు. ముదిరాజ్‌ల వంశాచార, సాంప్రదాచారణలో భాగంగా, సనాతన వారసత్వ నేపథ్యంలో, పట్టు వస్త్రాలను కుల దేవతయైన అమ్మవారికి కట్నకానుకలుగా సమర్పించేందుకు ఉద్యుక్తులైనారు. సకాల వర్షాలు కురవాలని, సుభిక్ష వాతావరణం నెలకొనాలని పోచమ్మ తల్లిని కొబ్బరి బెల్లాలు, పసుపు కుం కుమలు, తీపి నైవేద్యాలతో పూజించ నున్నారు. ఏడాది పొడవునా చల్లగా చూడాలని ప్రార్థిస్తూ మొక్కులు తీర్చుకోన్నారు. సదరు కులాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, భక్తులు, కుల సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.