కరీంనగర్

ఫలాల అమలు .. కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, జూలై 21: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పాటు సంక్షేమ ఫలాలు, ఆశించిన ఉద్యోగాలు అందుతాయని పీసీసీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ మాజీఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన, మాజీమంత్రి సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కేకే.మహేందర్‌రెడ్డి, ముఖ్యనాయకులతో కలిసి, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, తిమ్మాపూర్, గుండారం, వీర్నపల్లి మండలకేంద్రం, మండలంలోని కంచర్లలో శనివారం పార్జీ జెండాను ఆవిష్కరించి, బూత్‌లెవల్ కమిటీ సమావేశాల్లో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనా విధానాలపై ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి రావడం ఖాయమని ప్రజల మనోగతం తెలుతున్నదని, కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే 2లక్షల వంతున పంటరుణాల మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు దోమ్మాట నర్సయ్య, నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, సాహేబ్, హమీద్, బండారి బాల్‌రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, బుగ్గ కృష్ణమూర్తిశర్మ, ఉచ్చిడి సునీతారెడ్డి, బానోత్ రాజునాయక్, ఎస్కే గౌస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా శంకర్
* పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ ఉత్తర్వులు జారీ
జగిత్యాల, జూలై 21: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బండ శంకర్‌ను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో 1987లో చేరిన శంకర్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తుండగా, గుర్తించిన అధిష్టానం ఎన్‌ఎస్‌యుఐ జగిత్యాల అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యునిగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునిగా, యూత్ కాం గ్రెస్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిందని,సమర్థవంతంగా పని చేస్తున్న బండ శంకర్‌ను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పదోన్నతి కల్పించ గా కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తుండడంతో గుర్తించిన టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి సూచనల మేరకు కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పని చేసే బాధ్యత పెరిగిందని తెలిపారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి తన నియామకానికి సహకరించారని వెల్లడించారు.
థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
* ఎన్టీపీసీ సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్‌కే రాయ్
గోదావరిఖని, జూలై 21: రాష్ట్రంలోని విద్యుత్ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీలో 1600 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేపడుతున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్‌కె రాయ్ ఆదేశించారు. తెలంగాణ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను అధికారుల బృందంతో కలిసి శనివారం ఆయన సందర్శించారు. పవర్ స్టేషన్‌లో బాయిలర్, టర్బైన్, చిమ్ని నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం ఆయన ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం పనుల వ్యవహరానికి సంబంధించి ఎన్టీపీసీలో సమీక్షించారు. నిర్మాణ పనుల వ్యవహరంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రక్షణతో కూడిన పనులను చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి వెలుగులను అందించేందుకు నిర్మాణం చేస్తున్న ఈ కొత్త ప్రా జెక్ట్ పనులను అనుకున్నంత సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్‌ఇడీ దిలీప్‌కుమార్ దూబే, రామగుండం ఎన్టీపీసీ జీజీఎం రవీం ద్ర, జీఎంలు మ్యాథ్య్సూ వర్గీస్, బాబ్జీ, జైన్, లార్డ్, ఎజీఎం రమేష్‌లున్నారు.
రామగుండం అభివృద్ధిపై నిర్లక్ష్యం
* ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దినేష్ * రోడ్లపై నిలిచిన నీటిలో చేపలు పడుతూ నిరసన
గోదావరిఖని, జూలై 21: రామగుండం ఎమ్మెల్యే, మేయర్‌లు వర్గ పోరు పెట్టుకుంటూ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆలిండియా యూత్ ఫెడరేషణ్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి మద్దెల దినేష్ విమర్శించారు. గోదావరిఖనిలోని కూరగాయాల మార్కెట్ వద్ద రోడ్డుపై వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తుందని నిరసిస్తూ ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు గాలాలతో చేపలు పడుతూ శనివారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లు పూర్తిగా చెడిపోయాయని, అయిన పాలక వర్గం పట్టించుకోవడం లేదని అన్నారు. అభివృద్ధికి ఎన్నో నిధులు వస్తున్న ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం మూలంగా అవి ఇతర శాఖలకు పోతున్నా సిగ్గు లేకుండా విబేధాలను సృష్టించుకుంటూ కాలం గడుపుతున్నారని ఎద్దేవ చేశారు. అసలు రామగుండం కార్పొరేషనేనా అని ప్రజలు అనుమాన పడుతున్నారని తెలిపారు. చుట్టూ పక్కల గ్రామాలు దిన దిన అభివృద్ధి చెందుతుంటే మన కార్పొరేషన్ మాత్రం పూర్తిగా 10 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. కార్పొరేషన్‌కు వెంటనే ప్రత్యేకాధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు టి.రమేష్, రేణికుంట్ల ప్రీతమ్, ఈర్ల రాంచంద్ర, సుద్దాల అనురాజ్, ఎం. ఆగయ్య, నరేష్, సాగర్, తదితరులున్నారు.