కరీంనగర్

అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలపల్లి, జూలై 22: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పె ద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మినర్సింహాస్వామిని స్పీకర్ దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ఱకుంభంతో స్వా గతించారు. సర్పంచ్ పెద్దపల్లి సత్యసాగర్ ఉపసర్పంచ్ కల్లెపెల్లి అంజయ్య గొట్టెముక్కుల రవీందర్‌రెడ్డి దంపతులకు శాలువాలుకప్పి సన్మానించారు. ఆలయానికి డిప్యూటీ స్పీకర్ దంపతులు బంగారు కళ్ళు రూ. 5566, డాక్టర్ లక్ష్మి ఇంద్రసేనారెడ్డి వెండి శఠగోపం, వెండి పల్లెంలు బహూకరించారు. అనంతరం అమె విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి మూలాలైన ఆరోగ్యం, వి ద్య, సాగు, తాగునీరు, హరితహారంపై ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికేసులు వేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించితీరుతామన్నారు. హరిత కమిటీలతో ప్రతి గ్రామాన్ని హరితవనంగా మా ర్చడానికి యజ్ఞంలాగా చేపడుతున్నామని, తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడమే కాకుండా పనులు ముందుకుసాగకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. భగవంతుని ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తామన్నారు. వెంట నాయకులు ఆకా రం భాస్కర్‌రెడ్డి, పల్లె రాములు, గొట్టెముక్కుల రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.
నేడు కలెక్టరేట్ ఎదుట జనసమితి రైతుదీక్ష
జగిత్యాల, జూలై 22: ప్రొ. కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జన సమి తి సోమవారం జిల్లా కలెక్టరేట్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేపడుతుందని ఇందులో భాగంగా జగిత్యాల కలెక్టరేట్‌కు జిల్లాలోని రైతులు, మద్ధతుదారు లు తరలిరావాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా కన్వీనర్ చుక్క గంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో గం గారెడ్డి మాట్లాడుతూ రైతుబంధు, భూప్రక్షాళన, సాదాబైనామాల పట్టాదారుపాసు పుస్తకాలలో జరిగిన తప్పులు, అవినీతి, అక్రమాల బాధిత రైతులు ఆధారాల తో రైతుదీక్షకు తరలిరావాలని, రైతు సమస్యలపై కలెక్టర్‌కు విన్నవిస్తామని, సమస్యల పరిష్కారానికి తెలంగాణ జనసమితి కృషిచేస్తుందని గంగారెడ్డి తెలిపారు.