కరీంనగర్

జిల్లాలో హవాలా హవా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 22: కేంద్ర ప్రభు త్వం ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను బ లోపేతం చేయడానికి పెను మార్పులు తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు గండికొట్టేవిధంగా జగిత్యాల జిల్లాలో హవాలా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా తీసేవిధంగా గల్ఫ్ ఏజెంట్లు చక్రం తిప్పుతున్నారు. జిల్లా లో దాదాపుగా రోజుకు రూ. 5 కోట్ల చలా‘మణి’ చేస్తున్న తీరు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందడం లో ఎలాంటి సందేహంలేదు. ఇందు కు సంబంధించిన వివరాల మేరకు జి ల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల ను ంచి ఉన్న ఊరు.. భార్యపిల్లలు, కన్న తల్లిదండ్రులను వదిలి పొట్టుచేతబట్టుకొని ఉపాధి కోసం పెద్దసంఖ్యలో ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు పయ నం అయిన సంగతి తెలిసిందే. ఈ నే పథ్యంలో గత కొద్ది సంవత్సరాల ను ంచి హవాలా వ్యాపారం జోరుగా కొ నసాగుతూవస్తున్నక్రమంలో కొద్ది రో జులు ఈ వ్యాపారాన్ని సంబంధిత యంత్రాంగం అదుపుచేసే ప్రయత్నా లు చేసినప్పటికీ ఆగినట్టే ఆగి మళ్లీ జి ల్లాలో హవాలా వ్యాపారం పుంజుకు ంది. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుత లం చేసే హవాలా ‘హుండీ’ హవా ఆ గకుండా కొనసాగుతూనేఉంది. ప్రవా స భారతీయులు, వ్యాపారులే లక్ష్యం గా హవాలా హవా మళ్లీ పుంజుకుంది. గత కొనే్నళ్లుగా సద్దుమణిగిన హవా లా ‘హుండీ’ హవా మళ్లీ పురుడుపోసుకుంటోంది. బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన భారతీయులు త మ కుటుంబాలకు హవాలా ద్వారా డ బ్బులు చేరవేస్తున్నారు. విదేశాల్లో ప్ర వాస భారతీయులనుండి అక్కడి డ బ్బులు తీసుకుంటూ అక్రమ మా ర్గాల్లో భారత్‌లోకి బంగారాన్ని కస్ట మ్స్ అధికారుల కళ్లుకప్పి చేరవేస్తున నట్లు సమాచారం. హవాలా వ్యాపారు లు రూ. లక్షకు రూ. 2వేలు సంపాదిస్తున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తదితర పట్టణాల్లో హవాలా హవా కొనసాగుతో ంది. జిల్లాలో ప్రతిరోజూ రూ. 5 కోట్ల హవాలా వ్యాపారం కొనసాగుతున్న ట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఇద్దరు ప్రధాన ఏజెంట్లు, కో రుట్లలో మరో ఇద్దరు, మెట్‌పల్లిలో ఒ కరు, ఆర్మూర్‌లో ఇద్దరు ప్రధాన ఏజెం ట్లు ఉండగా మరికొందరు సబ్ ఏజెంట్లను నియమించుకొని ఈ హవాలా వ్యాపారం గుట్టుచప్పుకు కాకుండా సాగిస్తున్నట్లు సమాచారం.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే హవాలా వ్యాపారాన్ని అ రికట్టాల్సిన కొందరు ప్రజాప్రతినిధు లు, మరికొందరి అధికారుల అండదండలతోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా హవాలా వ్యాపారం విరాజిల్లుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్ర భుత్వం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపిస్తున్న దొంగనోట్ల తోపాటు, హవాలా వ్యాపారాన్ని అరికట్టేందుకు పాలకులు ప్రయత్నాలు చేసినా అక్రమ మార్గాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఆరితేరిన ప్యాపారులు అక్రమంగా సంపాదించేందుకు భారత దే శ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తూ హవాలా హవా ఆగకుండా కొనసాగిస్తుండడం గమనార్హం. మరోవైపు మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, బ్యాంక్ లావాదేవీలపై ప న్ను లాంటి అంశాలతోనే కొన్నాళ్లుగా హవాలా (హుండీ) జోరుగా సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదు.