కరీంనగర్

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14:రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళ వారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో రైతుబీమా పథకంలో రైతులకు బీమా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబీమా పథకం ద్వారా అన్నదాతల కుటుంబాలకు భరోసా చేకూరుందని, రైతుల కోసం సీఎం కేసీఆర్ పెట్టుబడి రాయితీ బీమా పథకం ప్రవేశపెట్టి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించారన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
సుల్తానాబాద్, ఆగస్టు 14: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సుల్తానాబాద్ ఎస్‌ఐ కె.రాజేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీరుకుళ్ల గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా నిమ్మ, దానిమ్మ, మామిడితో పాటు ఇతర పండ్ల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షించి కాపాడుకోవాలని, పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని ఎస్‌ఐ సూచించారు.
సీఎం సహాయనిధి చెక్కు అందించిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్, ఆగస్టు 14: సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన నూనె మహేష్ పటేల్‌కు ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన 40 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ఎమ్మెల్యేకి, నాకు అన్ని విధాలా దగ్గరుండి సహాయం చేసిన సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్‌లకు మహేష్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మణ్‌కు టీటీఆర్ ఫౌండేషన్ చేయూత
సుల్తానాబాద్, ఆగస్టు 14: సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన కరాటే లక్ష్మణ్ గత కొంత కాలంగా పక్షవాతానికి లోనై మంచానికే పరిమితమవగా లక్ష్మణ్‌ను టిటిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు తానిపర్తి తిరుపతి రావు పరామర్శించారు. కరాటేలో ఎన్నో ప్రతిభా పురస్కారాలు అందుకొని ఎంతో మందికి కరాటేలో శిక్షణ ఇచ్చిన లక్ష్మణ్ ధీనస్థితికి ఛలించిన టిటిఆర్ వైద్య ఖర్చులకు గాను తమ ఫౌండేషన్ ద్వారా ఏడాది క్రితం నుండే నెల నెలా రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు. ఈ మేరకు ఈ నెలకు సంబంధించిన చెక్కును మంగళవారం టిటిఆర్ ఫౌండేషన్ బాధ్యులు ఆయనకు అందజేసి భాగోగులు తెలుసుకున్నారు.
విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ
సుల్తానాబాద్, ఆగస్టు 14: సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గన్నమనేని రంగారావు, వారి కుమారులు శ్రీవాత్సవ్‌రావు, శ్రీహాస్‌రావుల జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పాఠశాల విద్యార్థులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.