కరీంనగర్

ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజాకర్షణ కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 14: తెలంగాణ రోడు రవాణా సంస్థ పలు ప్రజాకర్షణ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజాదరణ పొందుతున్నదని కరీంనగర్ ఆర్టీసీ డీఎం మద్దులేటి అన్నారు. మంగళవారం ధర్మపురి క్షేత్ర ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో జగిత్యాల డిపో మేనేజర్ హన్మంతరావు తమ కృషి ద్వారా గుర్తింపునందారని, డిపోను ఏళ్ళుగా లాభాల బాటలో పయనింప చేస్తున్నారని, అందుకు సహకరిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. ధర్మపురి క్షేత్రానికి భక్తులు నిత్యం రాకపోకలు సాగించే క్రమంలో స్టేషన్ ఆవరణ ఆకర్షణీయంగా, అందంగా ఉండాలదన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ అవార్డు గ్రహీత జగిత్యాల డీఎం పారువెల్ల హన్మంతరావు మాట్లాడుతూ, జిల్లాలో 1000మొక్కలు నాటడం లక్ష్యంగా పూర్తి చేయనున్నామన్నారు.
కంటి వెలుగు ఏర్పాట్లపై సమీక్ష
ధర్మపురి, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పేదలకు వరమైన కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. కంటి పరీక్షార్తులు ఇబ్బందులకు లోను కాకుండా ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలన
పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్, ఎస్పీ సునీల్‌దత్
జగిత్యాల, ఆగస్టు 14: జిల్లా కేంద్రమైన జగిత్యాల ఖిలాలో బుధవారం జరిగే పంద్రాగస్టు పర్వదిన వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్, జిల్లా ఎస్పీ సునీల్ దత్ పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాల ఖిలాలో జరిగే వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. పంద్రాగస్టు అంబరాన్ని తాకే విధంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.