కరీంనగర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదింపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 14: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదింపేందుకు సైనికుల్లా కదంతొక్కి కదలాలని ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాల టౌన్‌హాల్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ చౌరస్తాలో కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలు అవంభిస్తున్నాయని, కాంట్రాక్ట్ ఔట్ రిసోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, ప్రస్తుతం ఉన్న వారినే క్రమబద్దీకరించాలని, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనాలు చెల్లించి ఉద్యోగ భధ్రత కల్పిం చాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రూపుమాపుతామని చెప్పిన సీఎం కేసీఆర్ మొన్న గురుకుల విద్యాలయాల్లో అధ్యాపక, సిబ్బంది నియామ కాలు కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం తన చిత్తశుద్దికి నిదర్శమన్నారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎన్. కరణకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ముఖ్రం, జిల్లా నేతలు కుర్మాచలం ఉమామహేష్, శ్రీగాద దేవదాసు, వెన్న సురేష్, గొర్రె లక్ష్మి, సఫీయా, అంజలి, విజయ తదితరులు పాల్గొన్నారు.
నాగుల పంచమికి విస్తృత ఏర్పాట్లు
ధర్మపురి, ఆగస్టు 14: ధర్మపురి క్షేత్రంలో బుధవారం నిర్వహించనున్న నాగుల పంచమి వేడుకలకు దేవస్థానం పక్షాన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలోని నంది విగ్రహ కూడలి వద్ద వెలసిన కీర్తి శేషులు కొరిడె సదాశివ శర్మ, రాంబాయమ్మ దంపతులు నిర్మించిన ప్రాచీన నాగేంద్రాలయంలో, నాగుల పంచమి పర్వ దిన సందర్భంగా నాగదోష నివారణార్థం, సకల కామ్య సాఫల్యార్థం పర్వదినాన ప్రత్యేక నాగపూజలు నిర్వహించనున్నారు. క్షేత్రంలోని శ్రీరామలింగేశ్వరాలయ అంతర్భాగమైన నాగ దేవతకు, తెనుగువాడలో ప్రతిష్ఠిత నాగదేతతకు ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.