కరీంనగర్

జిల్లాలో స్వచ్ఛసర్వేక్షణ్ టీం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 14: పంద్రాగస్టు తరువాత జిల్లాలో స్వచ్చసర్వేక్షన్ టీం పర్యటించనున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోపరిసరాల పరిశుభ్రతలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ సూచించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చసర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృంధం జగిత్యాల జిల్లాలో పర్యటించను న్న దృష్ట్యా చెత్తాచెదారం లేకుండా పరిసరాలు, పరిశుభ్రంగా ఉంచేలా అధికార యంత్రాంగం అంకితభావంతో కృషి చేసి రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలన్నారు. గ్రామాల్లో ఎస్‌ఎస్‌జీపై పరిపూర్ణ అవగాహన కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ హరిత హారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి ఏపుగా పెరిగే వరకు ‘మొక్క’వోని దీక్షతో ఉద్యమిద్దామన్నారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు,విద్యార్థులు విద్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, ఎంపీడీఓ, తహశీల్దార్లు,వ్యవసాయ అధికారులు, పోలీస్, రెవెన్యూ, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చ సేవా సంస్థలు, యువజన సంఘాలు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. జిల్లాలో 251మంది చెట్టుపట్టా దారులను గుర్తించామని, జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతోపాటు అన్ని మండలాల్లో వృక్ష ప్రసాదాలు, వృక్షాభిషేకాలు మహోద్యమంగా చేపట్టే కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం అవసరమే నని కలెక్టర్ శరత్ వెల్లడించారు.