కరీంనగర్

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఆగస్టు 14: రానున్న రోజుల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ విజయం సాధించి, పెద్దపల్లిలో పార్టీ జెండాను ఎగురవేయడం ఖాయమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ విశ్రాంతి భవనం వద్ద పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున విజయరమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాహుల్‌గాంధీ విద్యార్థి గర్జన సభకు తరలివెళ్లారు. పట్టణంలో ని విశ్రాంతి భవనం నుంచి పాత పెట్రో ల్ బంక్ వరకు రాజీవ్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అక్కడే వాహనాల ర్యాలీని విజ్జన్న ప్రారంభించారు. అంతకుముందు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధి సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లు, ఇతరత్రా వాహనాల్లో నాలుగు వేల మంది కార్యకర్తలతో హైదరాబాద్‌కు వెళ్లటం జరుగుతుందన్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేసీఆర్ అణుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని, రానున్న ఎన్నికల్లో ఆశీర్వదిస్తారని రాష్ట్రం, కేంద్రంలోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. సమావేశంలో నేతలు ఘంట రాములు, అంతటి అన్నయ్య గౌడ్, ముత్యం రమేష్, పన్నాల రాము లు, ముత్యాల రవీందర్, అమిరిశెట్టి రాజలింగం, కుమార్ కిషోర్, వెగోళం అబ్బయ్య, సాజిద్, సంజీవ్, గంగాధర్, పలువురు ఉన్నారు.
మూఢవిశ్వాసాలతో..
జీవితాలు నాశనం చేసుకోవద్దు
* ఏసీపీ హబీబ్‌ఖాన్
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 14: కంప్యూటర్ యుగంలో పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో మూఢ విశ్వాసాలకు తావు లేదని, మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. మహిళలపై జరిగే నేరాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా షీటీంలు పని చేస్తున్నాయన్నారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలో సోమవారం రాత్రి పోలీసు కళా బృందాలతో మూఢనమ్మకాలతో పాటు పోలీసుశాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఏసీపీ మాట్లాడు తూ మంత్రాలు లేవని, మంత్రాల నెపంతతో హత్యలు, తగదాలు ఇప్పటికీ గ్రా మాల్లో జరగడం దురదృష్టకరమన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో మూఢ విశ్వాసాలతో పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం మంచిది కాదన్నారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐ గోపతి నరేందర్, బసంత్‌నగర్ ఎస్సై రాజ్‌కుమార్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం.. కేసీఆర్ పాలన
* రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అధిక పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నా రు. మంగళవారం ధర్మపురి క్షేత్రం టీటీడీ కల్యాణ మండపంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఈశ్వర్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆడపిల్ల పుట్టడమే భారంగా భావించే ఎందరో పేదల కుటుంబానికి పెద్ద దిక్కు నేనున్నానంటూ, కేసీఆర్ వివాహానికి కనీస అవసరానికి వెన్నుదన్నుగా నిలవడం, చెక్కులు అర్హులకు పంపిణీ చేస్తున్నపుడు తల్లుల కళ్లలోని ఆనందం, ధైర్యం తమ ప్రభుత్వానికి ఆశీస్సులుగా భావిస్తున్నామన్నారు. 172 మందికి 1,21,96,472 రూపాయల చెక్కులను ఈశ్వర్ అందజేశారు. ధర్మపురి ఎంపీపీ మమతారావు, వైస్ ఎంపీపీ రాజేశ్ కుమార్, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి, జైనా పీఏసీఎస్ చైర్మన్లు రాజేందర్, నరేశ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ భీమయ్య, ఎంపీటీసీ రమేశ్, కోఆప్షన్ సభ్యుడు ఆసిఫ్, తహశీల్‌దార్ నవీన్, ఎంపీడీఓ నర్సయ్య, డీటీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వివిధ గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాగడాల ర్యాలీ
ముకరంపుర కరీంనగర్, ఆగస్టు 14: భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అఖిల భారత సం కల్ప దివస్ సందర్భంగా స్థానిక తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు మంగళవారం రాత్రి కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఇనుగంటి మధుసూదన్ రావు, భజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 14న దేశం మతం ఆధారంగా దేశం ము క్కలైందని ఒకటి పాకిస్థాన్, రెండు భారత్‌గా ఏర్పడ్డాయని, తామంతా ఈ అఖండ భారత్‌ను నిర్మించడానికి తమవంతుగా కృషి చేస్తున్నామని, ప్రతీ ఒక హిందువు దేశ సేవకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
11వ స్థానం లభించడం సంతోషకరం
* కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, ఆగస్టు 14: ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు, అం దుతున్న సేవలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కరీంనగర్‌కు 11వ స్థానం లభించడం సంతోషకరమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. దీంతో అందరం కలిసి కరీంనగర్ అభివృద్ధికి మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. మంగళవారం స్థా నిక శే్వత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జాతీయ స్థాయిలో 11వ స్థానం లభించిందం టే మా పాలన, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాల ఎన్నో విమర్శలు చేస్తున్నా, తాము వాటిపై ప్రతివిమర్శలు చేయకుండా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కరీంనగర్ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, వారి మద్ధతు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు. కేవలం నాలుగేళ్లల్లోనే కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే వాటి ఫలితాలు ప్రజలకు అందుతాయని అన్నారు. ‘సుడా’కు పూర్తి స్థా యి పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించిందని, సుడా కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కరీంనగర్‌కు వస్తున్నారని, ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. రూ.88కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎలగందుల వద్ద మధ్యాహ్నం 2గంటలకు, పేదలకు రూ.5లకే అందించే భోజన పథకాన్ని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో 2:30 గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే సాయంత్రం 4గంటలకు స్మార్ట్ సీటీ పనులు ప్రారంభించి, ఐటీ టవర్ పనులను పరిశీలిస్తారని వివరించారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ కరీంనగర్‌కు 11వ స్థానం దక్కడం తమ అత్యుత్తమ పాలనకు నిదర్శనమని అన్నారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఐపీఎంకు సీపీ ఎంపిక
* హర్షం వ్యక్తం చేసిన పోలీసు అధికారులు

కరీంనగర్, ఆగస్టు 14: అసాధారణమైన సేవలందించినందుకు గాను కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి ఇండియన్ పోలీ సు మెడల్‌కు (ఐపీఎం) ఎంపికయ్యారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభు త్వం కమలాసన్ రెడ్డిని ఈ మెడల్ కు ఎంపిక చేసింది. ఈ మేరకు మం గళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మెదక్ జిల్లా శంకరంపేట మండలం దరిపల్లికి చెందిన వీబీ కమలాసన్‌రెడ్డి 1994లో డీఎస్పీగా పోలీసు శాఖలో చేరారు. పాఠశాల విద్యాభ్యాసం మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, ఉన్నత చదువులు హైదరాబాద్‌లో కొనసాగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల డీఎస్పీగా మొదట బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా, అడిషనల్ డీఎస్పీగా పశ్చిమగోదావరి జిల్లాలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా, ఇంటలిజెన్స్ విభాగంలో ఒఎస్‌డిగా పనిచేశారు. 2004లో ఐపీఎస్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్‌లో టాస్క్ఫో ర్స్ డీసీపీగా, స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్పీగా, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న క్రమంలోనే కమలాసన్‌రెడ్డిని నూతనంగా ఏర్పాటైన కరీంనగర్ కమిషనరేట్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు తొలి పోలీసు కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కమలాసన్‌రెడ్డి ఐపీఎంకు ఎంపిక కావడం పట్ల పోలీసు అదికారులు, వివిధ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సీపీకి శుభాకాంక్షలు తెలిపారు.