కరీంనగర్

మాజీ ఎంపీ పొన్నం దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 17: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను శుక్రవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్‌లో దగ్ధం చేశారు. ఆ సంఘం నేత ఎండీ ఫహాద్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్ పట్ల దురుసు వ్యాఖ్యలు చేయటం పొన్నం అహంభావాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేకపోగా, పదవి కోసం కక్కుర్తిపడ్డ ఘన చరిత్ర పొన్నందేనని ఎద్దేవా చేశారు. కేవలం పత్రికల్లో ప్రచారం కోసమే పనికి మాలిన వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు దాసరి వెంకటరెడ్డి, యూసుఫ్, రవినాయక్, తేజ, వర్మ, శ్రావన్, మాజిద్, తబ్రీజ్, సాయి, శ్రీకాంత్, సంపత్, పవన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.