కరీంనగర్

కార్మిక చట్టాలు నిర్వీరం చేస్తే .. ప్రభుత్వాలను గద్దె దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, ఆగస్టు 17: అంబాని, ఆదానిల కొమ్ముకాస్తు దేశ సంపదను వారికి దారదత్తం చేయడానికే కార్మిక చట్టాలను సవరిస్తు, చట్టాలను నిర్వీర్యం చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలను ప్రజలతో కలిసి గద్దె దించుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని రైల్వే స్టేషన్ ఎఐటీయుసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు జాత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏన్నికలకు ముందు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంత వరకుపూర్తిగా నేరవెర్చలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పరిశ్రమల్లో ఉద్యోగ భద్రత లేకుండా చట్టాలు సవరిస్తు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాలు రాకుండా జీవోలను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పలు పరిశ్రమల్లో పనిచేసే వారిని అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని, ముఖ్యమంత్రి ఇప్పటి వరకు హామీలు అమలు చేయడం లేదన్నారు. నీరవ్‌మోడీ, మాల్యాలకు వేల కోట్లు ఋణాలు ఇచ్చే బ్యాంకులు పేదలకు మాత్రం ఋణం ఇవ్వడానికి పలు కొర్రిలు పెడుతుందని, ఎల్‌ఐసీ, రైల్వేతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం ప్రయివేటు పెట్టుబడులను ప్రొత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి, విద్యుత్ సంస్థల్లో భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైన ఇచ్చిన హమీలను నేరవెర్చని యెడల ప్రజలతో కలిసి భారీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జని రత్నకర్‌రావు, బాలరాజు, కరుణకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి కొమటిరెడ్డి రామ్‌రెడ్డి, ఎఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు కాల్వనర్సయ్య యాదవ్, రైల్వే హమాలీ అధ్యక్షుడు, కార్యదర్శి సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన రైతు కుటుంబానికి
రూ. ఐదు లక్షల చెక్కు అందజేత
చందుర్తి, ఆగస్టు 17: చందుర్తి మండలం మూఢపల్లి గ్రామానికి చెందిన రాచర్ల భూదవ్వ అనే మహిళా రైతు అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతిచెం దింది. దీంతో ముచ్చటగా ప్రభుత్వం రైతుబీమా కింద బూదవ్వ కుమారులు ప్రశాంత్‌కు ఐదు లక్షల రూపాయలను చందుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమచేయగా.. ఆన్‌లైన్ చెక్కును శుక్రవారం ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మృతురాలి కుమారుడికి అందజేశారు. రైతుబీమాలో భాగం గా రాష్ట్రంలో మొట్టమొదటి మరణం చందుర్తి మండలం మూఢపల్లిలో జరిగింది. జడ్పీటీసీ గంగాధర్, నేతలు మరాఠి మల్లిక్, వెంకన్న, శంకర్ పాల్గొన్నారు.