కరీంనగర్

ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 17: రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలను ఓట్ల కు పనికొచ్చే యంత్రాలుగా వాడుకొని వదిలేస్తున్న రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలోని రామాలయం ఆవరణలో బీసీ సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. ఈసందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే వర కు బీసీలను కూరల్లో కరివేపాకుల్లా వాడుకొని వదిలేసే విధానాల కు పా ల్పడుతున్న రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ రుచి చూపిస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్ర సిద్ధించి 72 యేళ్లు గడుస్తు న్నా ఓటు బ్యాంక్ యంత్రాలుగానే వాడుకుంటూ ఎన్నికల వేల కొంగజపం లాగా ఓట్ల తపం చేస్తున్న రాజకీయ పార్టీలను ఓ కంట కనిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో నేతలు శేర్ నర్సారెడ్డి, ముంజ ధర్మపురి, చింతల గంగాధర్, ఎం. సుధీర్‌కుమార్, రాగుల గోపాలచారి, ర్యాగి ల్ల సత్యనారాయణ, ఇట్టె సురేందర్, ఓరుగంటి భార్గవరాం, రద శ్రీనివాస్‌గౌడ్, కట్కూరి మల్లేశం, నాగరాజు, ఎనగంటి రవి పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా కంటి శిబిరాల నిర్వహణ
* కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల, ఆగస్టు 17: జిల్లాని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పరీక్షల నిర్వహణ కోసం ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాల్లోని గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్యశిబిరాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు వైద్య శిబిరాలను ప్రణాళికాబద్ధంగా 23వైద్య బృందాలతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 9లక్షలకుపై ఉన్న జనాభాలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పథకంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ప్రతి వైద్య శిబిరంలో దాదాపుగా 250నుంచి 300మందికి కంటి పరీక్షలను వైద్య బృందం నిర్వహిస్తుందని, ఈ వైద్య పరీక్షల్లో అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచితంగా జిల్లా కేంద్రంలోని పావని కంటి ఆసుపత్రిలో నిర్వహించబడుతుందని తెలిపారు. అలాగే కంటి వెలుగు పథకంలో పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రణాళికాబ ద్ధంగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శరత్ వివరించారు. కార్యక్రమాన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాల్లో పరీక్ష చేయించుకొని వైద్యబృందాల సూచనల మేరకు కంటి వెలుగులు పొందాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుగంధిని, ఆయా మండలాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా వెంకన్న మహా క్షీరాభిషేకం

* అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ధర్మపురి, ఆగస్టు 17: ధర్మపురి దేవస్థానంలోని ప్రధానాలయమైన వేంకటేశ్వర ఆలయంలో వార్షిక శుక్రవారోత్స వంలో అంతర్భాగంగా మహా క్షీరాభిషే కం వైభవోపేతంగా జరిగింది. మహావిష్ణువు క్షీరాభిషేకానికి సంతుష్టుడై, సకల కోర్కెలు నెరవేరుస్తాడని ప్రతీతి. లక్ష్మీదేవి నివాస స్థానమైన వక్షము గల శ్రీవేంకటేశ్వరునికి, లక్ష్మీవారమైన శుక్రవారంనాడు క్షీరాభిషేకం సర్వశ్రేష్టం మరియు స్వామి వారికి ప్రీతిపాత్రము. తనకిష్టమైన దానిని సమర్పించేవారికి ఇష్టమైనవి ఇచ్చే వరదుడు అయిన శ్రీవేంకటేశ్వరుని శుక్రవారోత్సవ సందర్భంగా నిర్వహించే క్షీరాభిషేకం విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నది. శ్రా వణ శుక్ల పక్ష తొలి శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అనుబంధ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని విధివిధాన, వేదోక్త పద్దతిలో నిర్వహించారు. అనారోగ్య నివారణా ర్థం ప్రత్యేక సుదర్శన హోమాన్ని, అలాగే మహా క్షీరాభిషేకం, అనంతరం శ్రీలక్ష్మీ హోమ కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. మునుముందుగా దేవాలయాన్ని, అర్చకులు సకలపాప పరిహారార్థం సంప్రోక్షణా ది కార్యక్రమాలు, లక్ష్మీ హవనాది పూ జలొనరించారు. ఉదయం 7 గంటలనుంచి 11 గంటల వరకు మహాక్షీరాభిషేకం సందర్భంగా మూలవిరాట్టును ముందుగా పాలతో అభిషేకించి, సర్వాంగ సుందరంగా అలంకరించి, కుంకుమార్చనలు గావించారు, అనంతరం ఏక, త్రయ, పంచమ, సప్త, సర్ప, నక్షత్ర, వృక్ష, కుంభాది హారతులు, మంత్రపుష్ప, అవధారయ, ఆశీర్వచనాది కార్యక్రమాలను నిర్వహించారు. అసంఖ్యాకులైన భక్తులు తమ గోత్రనామాదులతో గావించిన ప్రత్యేక పూజాదికాలలో భాగస్వాములైనారు. గృహ, గ్రహదోష, సర్వబాధల నివారణకు, సర్వాభీష్ఠ సిద్ధికి, ఆయురారోగ్య, ఐశ్వర్య, వ్యాపారాభివృద్ధికై నిర్వహించిన కార్యక్రమం సూపరింటెండెంట్ కిరణ్ నేతృత్వంలో, ఆలయ అర్చకులు నేరేళ్ల శ్రీనివాసాచార్య, శ్రీ్ధరాచార్య, ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య విధివిధానంగా నిర్వహించారు.
సిరిసిల్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* భారీ వర్షాల నేపథ్యంలో.. * ఫోన్ చేయాల్సిన నెంబర్ 6309141122
సిరిసిల్ల, ఆగస్టు 17: రానున్న 24 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం జిల్లా అధికారులను కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అప్రమత్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ప్రధాన కార్యస్థానం వదలి వెళ్ళవద్దని ఆదేశించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కునేందుకు సర్వసన్నద్దంగా ఉండాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం కార్యక్రమా లు నిరంతరం జరిగేలా చూస్తూ అం టూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కపుడు కనిపెట్టుకుని ఉండాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. విషజ్వరాలు ప్రబలిన చోట వెం టనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయం కావాల్సిన ప్రజలు 6309141122 నెంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. ప్రత్యేక కంట్రో ల్ రూం 24 గంటల పాటు రోజూ పని చేస్తుందని వెల్లడించారు.