కరీంనగర్

కేసీఆర్ రాకపోవడం అహంకారమే : పొన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 12: దేశంలోనే అతిపెద్ద రోడ్డుప్రమాదం జరిగి 58 మంది మృతి చెందినా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సంఘటన స్థలానికి రాకపోవడం అహంకార ధోరణేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నా రు. బుధవారం కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొన్నం మా ట్లాడుతూ మల్యాల మండలం రాం పూర్ వ్యవసాయ బావిలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 18మంది మరణించ గా అప్పటి సీఎం నెదురుమల్లి జనార్థన్‌రెడ్డి కొండగట్టు వద్ద రోడ్డు ప్రమా దం జరిగినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఇప్పటి ఆపధర్మ సీఎం కేసీఆర్ ఇక్కడి రాకపోవడం అహంకార పూరిత ధోరణేనని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సంస్థకు నాలుగేళ్లుగా ఎండీ లేడని, సీఎం అసమర్థపాలనే ఇందు కు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ 58 హత్యలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, ఇందుకు బాధ్యులైన వారిపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, ఇంటిలోని వారికి ఓ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.