కరీంనగర్

ప్రజల రుణం తీర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 12: నియోజకవర్గాల పునర్విభజన కారణంగా స్థానికేతరుడనైన నాకు సంపూర్ణ మద్దతు తెలిపి, రాజకీయ ఎదుగుదలకు చేయూతను అందించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎం తో రుణ పడి ఉన్నానని, దానిని తప్పక తీర్చుకుంటానని మాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ భావోద్వేగంతో ఉద్ఘాటించారు. శాసనసభ రద్దు తర్వాత, తిరిగి అభ్యర్థిత్వా న్ని ప్రకటింప చేసుకున్న అనంతరం తొలిసారిగా బుధవారం ధర్మపురి క్షేత్రంలో కనీవినీ ఎరగని స్వాగతాన్ని అందుకుని, దైవ పూజాదులలో సెంటిమెంట్‌ను అనుసరించి, దైవ పూజాదులలో సతీమణితో కలిసి పాల్గొన్న అనంతరం ఈశ్వర్ మాట్లాడు తూ తొమ్మిదిన్నర ఏళ్ల పదవీ కాలంలో ప్రజలతో మమేకమై, సమస్యల సాధనకు కృషి సల్పానని, తనపై అచంచల విశ్వాసముంచిన అధినేత కేసిఆర్ తిరిగి అభ్యర్థిత్వం ఖరారు చేశారని, మళ్లీ ప్రజల దీవెనలు కోరుతున్నానన్నారు. దైవానగ్రహంతో, సీఎం ఆశీస్సులతో దేవస్థానానికి 50 కోట్లు బడ్జెట్‌లో కేటాయిం పజేశానని, మేజర్ ధర్మపురి పంచాయతీని పురపాలక సంగా మార్చి ముందస్తుగా 25 కోట్లు మంజూరు చేయించానన్నారు. మరోసారి ప్రజల ఆదరణ కావాలని, తనకు 6వ సారి అవకాశమిచ్చిన కేసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని తాజామాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సహధర్మచారిణి స్నేహలతయుక్తంగా దర్శించి, స్వామి వారి ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఈశ్వర్ దంపతులకు స్వామి, అమ్మవారల శేషస్త్రాలు సమర్పించి, ప్రసాదాలు అందజేసి, సన్మానించారు. అర్చకులు, వేద పండితులు వైదికాశీస్సులు అందజేశారు.
ఘన స్వాగతం
రాష్ట్ర శాసనసభ రద్దు కావించ బడి, తిరిగి రానున్న ఎన్నికలలో తన అభ్యర్థిత్వాన్ని 6వ మారు ఖరారు చేసుకుని, ధర్మపురి దైవ దర్శనానికి విచ్చేసిన ధర్మపురి తాజామాజీ శాసనసభ్యు లు, తాజామాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌కు కనీవినీ ఎరగని స్వాగతం లభించింది. ధర్మపురికి 8 కిలోమీటర్ల దూరాన గల రాయపట్నం ఆయనను పూలమాలలతో సత్కరించి, స్వా గతం పలికి, అక్కడి నుండి ధర్మపురి వరకు వేలాది ద్విచక్రవాహనాలపై నాయకులు మిన్నంటిన నినాదాలు చేస్తూ, గులాబి జెండాలు హస్తాలబూని, భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, గాంధీ, నంది, దేవస్థానం, స్మారక స్థూపం, వివేకానంద విగ్రహ కూడళ్ల మీదుగా పుర వీధుల గుండా వాహన ర్యాలీ నిర్వహించా రు. మహిళలు మంగళహారతులు పట్టా రు. అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను కొప్పుల పూలమాలాలంకృతుల గా వించారు. నియోజకవర్గానికి చెందిన వేలా ది మందితో ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్‌లో అభిమానుల సమ్మేళనంలో బుగ్గారం, సిరికొండకు చెందిన 30 మంది తెరాసలో చేరారు.
పెట్రోధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ధర్నా
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 12: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణ చేయకపోవడాన్ని నిరసిస్తూ, వైసిపి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ జిలా లశాఖ అధ్యక్షుడు డా.కె.నగేశ్ మాట్లాడుతూ, ఇంధన ధరలపై వ్యాట్‌ను ఎత్తేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులను యధేచ్చగా దోపిడీ చేస్తుందని ఆరోపించారు. లక్షలాది మంది వాహనదారులు నిత్యం వినియోగించే చమురు ధరలు తగ్గించటంలో ఆపద్ధర్మ సీఎం వైఫల్యం చెందారని మండిపడ్డారు. కేంద్రం ధరలు తగ్గించకున్నా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎత్తేస్తే కనీసం రూ.10 తగ్గుతుందని, దీనిపై వరుస ఆందోళనలు చేపడుతున్నా కనీస స్పందన లేకపోవటం శోచనీయమన్నారు. చమురు ధరల పెరుగుదలతోపేద, మద్య తరగతి కుటుంబీకులపై పెనుభారం పడుతుండగా, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వ్యాట్ ఎత్తేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆపార్టీ నేతలు బండమీది అంజయ్య, సలీం, వెంకటయ్య, ఎం.రాజవీరు, బీ.పెంచలయ్య, వై.రాములుతోపాటు పలువురు పాల్గొన్నారు.