కరీంనగర్

ఓటరు నమోదు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, సెప్టెంబర్ 12: బూత్ స్థాయి అధికారులు తమ బూత్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. బుధవారం గంగాధర మండల కేంద్రంలో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినిపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన బూత్ లెవల్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా వచ్చిన జేసీ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు పూర్తి చేయాలన్నారు. చనిపోయిన వారిని ఓటరు లిస్ట్ నుండి వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. తప్పిపోయిన వాటిని పునరుద్ధరించాలని, ఎలాంటి తీసివేతలు ఉండకూడదన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ బిక్షానాయక్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్ రావు, తహశీల్దార్లు సరిత, మో బిన్ అహ్మద్, రాజయ్య, ప్రసాద్, డిప్యూటి తహశీల్దార్ విశాలీ, ఆర్‌ఐలు కనుకరాజు, రహీంతో పాటు ఆరు మండలాల బూత్ లెవల్ సిబ్బంది పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలు పూజించాలని
సుల్తానాబాద్‌లో విద్యార్థుల ర్యాలీ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 12: గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని స్థానిక శ్రీవాణి కళాశాలల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా విద్యార్థుల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను వాడాలని ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బండారి కమలాకర్‌తో పాటు సదానందం, బాలు, కుమార్, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పర్యావరణం బహుమతిగా ఇవ్వాలి
* మట్టి గణనాథుల పంపిణీలో బర్నింగ్ స్టార్ సంపూ
సిరిసిల్ల, సెప్టెంబర్ 12: భవిష్యత్ తరాలకు పెద్ద బహుమతిగా పర్యావరణా న్ని అందించాలని, ఇందుకోసం మట్టి గణపతులను పూజించాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలో స్థానిక మానే రు స్వచ్ఛంద సంస్థ, గోదావరి పాలిమర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మట్టి గణపతులను’ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సినీ నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు, స్థానిక డీఎస్పీ ఎన్.వెంకటరమణలతో కలిసి మట్టి గణపతులను పంపిణీ చేశారు. మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథి జేసీ మాట్లాడుతూ మట్టి గణపతిని స్థాపించి భక్తితో పూజిస్తే ఫలితం వస్తుంది కానీ, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, భారీ ఖర్చులతో వేడుకలు చేయడం భక్తి కాదన్నారు. కార్యక్రమంలో చింతోజు నారాయణ, తుమ్మనపల్లి దుర్గేశ్‌చారి, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పరబ్రహ్మమూర్తి పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పెద్దపల్లి, సెప్టెంబర్ 12: టీఆర్‌ఎస్ టికెట్ బీసీలకే కేటాయించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి టీకెట్ ఇవ్వకుండా బీసీలకే టికెట్ కేటాయించాలని ఆపద్ధర్మ సీఎంను కోరారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా కార్యకర్తలను ఆదరించలేదని, టీఆర్‌ఎస్ కార్యకర్తలను రెండుగ్రూపులుగా ఏర్పాటు చేసి ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కార్యకర్తను ఆదరించని ఎమ్మెల్యేకు టికెట్ ఎలా కేటాయిస్తారని, వారికి టికెట్ కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురై, పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్ ఓటమి తప్పదని గుర్తుచేశారు. ఆయన వెంట కాల్వశ్రీరాంపూర్ జెడ్పిటీసీలు లంక సదయ్య, పడాల సార పర్శరాములు, సయ్యద్ మస్తత్,్ర సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు పోసాని శ్రీనివాస్‌యాదవ్, కుక్క కనుకరాజు, జహీర్‌ఖాన్, శ్రీనివాస్, కట్ట సదానందం బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.