కరీంనగర్

ఏసీబీ వలలో వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 18: పెద్దపల్లి జిల్లా రామగుండం మం డలం మేడిపల్లి (ఎన్టీపీసీ) గ్రామ రెవెన్యూ అధికారి ఎ.మహేందర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం రోజున వీఆర్వో మహేందర్ ఎన్టీపీసీ టిటిఎస్‌లోని తన ఇంటి వద్ద జమాల్‌పూర్ సతీష్ అనే వ్యక్తి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల్లో పేరు మార్పు కోసం 5వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీ ఎస్పీ కిరణ్ కుమార్ పట్టుకున్నారు. గోదావరిఖనికి చెందిన జమాల్‌పూర్ సతీష్ రామగుండం మండలం మల్కాపూర్ శివారులోని 218 సర్వే నెంబర్‌లో తన అన్న పేరు మీద ఉన్న 19.5 గుంటల భూమి కొంత కాలంగా ఆన్‌లైన్‌లో మరొకరి పేరు వస్తోందని, దీన్ని విచారణ జరిపి సరి చేయాలని తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయాన్ని పూర్తి స్థాయి లో విచారణ జరిపి పేరు మార్పు చేసి పట్టాపాసు బుక్కులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తనను 25వేల రూపాయలు లంచం అడిగాడని, దీంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించిన్నట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రోజున 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ వి ఆర్ ఓ మహేందర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డట్లు డి ఎస్పి కిరణ్‌కుమార్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహేందర్‌ను కరీంనగర్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విఆర్‌ఓ మహేందర్‌ను రామగుండం తహశీల్దార్ కార్యాలయం తీసుకెళ్లి అక్కడ ఈ విషయానికి సంబంధించి పూర్వ పరాలను ఆరా తీశారు.

అవినీతి రెవెన్యూ అధికారులపై ఎసీబీ ఆరా ?
రామగుండం ఉమ్మడి మండలంలో పని చేస్తున్న రెవెన్యూ అధికారుల అవినీతి వ్యవహారాలపైన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రామగుండం, అంతర్గాం, పొట్యాల, మండలాల్లో పని చేస్తున్న కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలు ఏసీబీ అధికారుల దృష్టికి రావడంతో వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి మండలంలోని కొందరు గ్రామ రెవెన్యూ అధికారులు అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధుల అండదండలతో అవినీతికి తెరలేపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న పలు ఆరోపణల వ్యవహారాల్లో ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ... అవినీతి రెవెన్యూ అధికారుల పూర్వ పరాల వివరాలను లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం..!

అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలుద్దాం
* టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 18: బీసీలకు పెద్దపీట వేసే పార్టీలకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలుద్దాం అని టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో బీసీ జేఏసీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశోక్‌కుమార్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లను కేటాయించే రాజకీయ పార్టీలకు మద్ధతు ఇచ్చి గెలిపించుకుందాం అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారని, అదే పట్టుదలతో ముందుకు సాగితేనే బీసీలకు మనుగడ ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇదే విషయమై టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ,బీజేపీ పార్టీలను కలిసి వినతి పత్రాలు అందించామన్నారు. బీసీల ఓట్లతో గద్దె నెక్కుతున్న రాజకీయ పార్టీలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపైనే స్వారీ చేసే విధానాలకు పాల్పడేలా వ్యవహరిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనన్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడితే అనుకున్నది సాధించుకుంటామని సమైక్యంగా ముందుకు సాగితే సగానికి పైగా సీట్లు పొందడం సమస్యే కాదన్నారు. టీబీసీ ఐకాస రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్, జిల్లా ప్రతినిధులు రాజగోపాలచారి, లక్ష్మణ్, ఆకుల నాగరాజు, గట్ల మహేష్, మర్రిపెల్లి పోచాలు, ఆకుల రాజన్న, కూసరి అనిల్, అడప గంగారాం, పుప్పాల కిశోర్‌కుమార్, లైశెట్టి వెంకటి, చిందం మనోహర్, గంగారాం, వకుళాభరం నర్సింహాచారి, హన్మాండ్లు, మ్యానపురి రాజనర్సయ్యి, సింహరాజు సంతోష్, గుండేటి గంగాధర్, ఈశ్వర్, రాధాకిషన్, పుప్పాల విజయ, కస్తూరి శ్రీమంజరి, మహిళా, యువజన, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.