కరీంనగర్

విద్యుత్ టవర్ల ఏర్పాటుకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 18: నగర రహదారుల విస్తరణలో భాగం గా నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ టవర్ల నిర్మాణానికి అధికారులు సహకరించి, వేగంగా పూర్తిచేయాలని పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని ట్రాన్స్‌కో సూపరెండెంట్ ఇంజనీర్ ఛాంబర్‌లో నిర్వహించిన విద్యుత్ అభివృద్ధి ప నుల సమీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన మొత్తాన్ని సంబంధిత శాఖలు ధరావత్తుగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గ్రామీణ విద్యుదీకరణలో భాగంగా అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వద్ద డబ్బులున్నట్లు ఎన్‌పిడిసిఎల్ సీఎండీ తెల్పిన దృష్ట్యా, నగరంతో పాటు గ్రామాల్లో అవసరమైన చోట సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రభుత్వ భూమి కేటాయించాలని కలెక్టర్‌ను కోరునున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ తరహా లో కరీంనగర్‌కు మూడు వైపులా నుంచి విద్యుత్ గ్రిడ్ అనుసంధానం చేసి, ఎలాంటి అవాంతరాల్లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణకు నిధులు మం జూరు కాగా, పద్మనగర్, వర్క్‌షాప్ వరుకు విద్యుత్ స్థంభాల తొలగింపుతో రోడ్డు విస్తరణ పనులు పూరె్తైనట్లు పేర్కొన్నారు. నాకాచౌరస్తా, కమాన్ మధ్య ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్థంభాలుండటంతో రహదారుల పనులు నిలిచిపోయాయయని, దీంతో ప్రయాణికులు దుమ్మతో ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు. ఈ పనుల నిర్వహణకు అవసరమయ్యే డబ్బులను 15 రోజుల్లో డిపాజిట్ చేసేందుకు మున్సిపల్ శాఖ అంగీకరించిన నేపథ్యంలో త్వరితగతిన విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాలని కోరినట్లు, దీనికి సీఎండీ అంగీకరించినట్లు చెప్పారు. అర్ధశతాబ్ధం కింద ఏర్పాటు చేసిన హైటెన్షన్ తీగలు కూడా తొలగించాలని కోరామన్నారు.
సమావేశంలో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోపాల్‌రావు, కరీంనగర్ సర్కిల్ సూపరెండెంట్ ఇంజనీర్ కే.మాధవరావు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే
చొప్పదండి, సెప్టెంబర్ 18: రాష్ట్రం లోని పల్లెలను పట్టణాలుగా మార్చిన ఘనత ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేని టీఆర్‌ఎస్ నేత గజ్జెల స్వామి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు 14 సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో అలుపెరగని పోరాటాన్ని కేసీఆర్ కొనసాగించారని, అనేక ఉద్యమాలకు ఫ్రోఫెసర్ జయశంకర్, అమరవీరుల ఆశాలతో ప్రా ణం పోసిని కేసీఆర్ తెలంగాణ సా ధించి పెట్టారని అన్నారు. అందుకే కేసీఆర్‌కు ప్రజలు పట్టణ కట్టారని, పదవిలో ఉంటు అన్నిరకాల వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, బీమా పథకం, రైతుబంధు పథకాలు అందించి రైతాంగాన్ని ఆదుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించలేదని, కానీ కేసీఆర్ నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేర్చారని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందించారని అందుకే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. పెద్దెల్లి శేఖర్, జక్కని విష్ణు, తోడేటి మధు, పిట్టల సత్యం, ఐతరవేని కొమురయ్య, మహేశుని వంశీ, మంద రవి, తిరుపతితో పాటు పలువురు పాల్గొన్నారు.