కరీంనగర్

తల్లిదండ్రులను విస్మరిస్తే.. అధోగతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 18: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను విస్మరిస్తే తనయులకు అధోగతే తప్పదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలోని ఐఎంఏ భవన్‌లో సీనియర్ సిటిజన్ల పోషణ,సంక్షేమం,సమస్యల పరిష్కార చట్టంపై మహిళలు, పిల్ల లు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారిణి అరవింద అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశోక్‌కుమార్ మాట్లాడుతూ వేధింపులకు గురైన వృ ద్ధులు, తల్లిదండ్రులు, వయోవృద్ధు ల సంరక్షణ చట్టం కింద ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయాలని, కలెక్టర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. వృద్ధు లు, తల్లిదండ్రులు, తమ పిల్లలగురించి ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో సమస్య పరిష్కరించాలని చట్టం పేర్కొందన్నారు. వయోవృద్ధులు ట్రిబ్యులన్ వేసిన కేసులను కో ర్టులో వేసుకోవడానికి వీలులేదని, దీనికి న్యాయవాది వచ్చి వాదించకూడదని, ఆ చట్టంలో పొందుపరిచారన్నారు. జిల్లాలో 150మంది వృద్ధులకు అన్ని సదుపాయాలతో వసతి గృహం, సంచార వాహనం, డేకేర్ సెంటర్, జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ పిలుపు అవగాహన పుస్తకాలను ఉచితంగా అందజేశారు. జి ల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి అరవింద మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు అడియాశలు చేయొద్దని, తల్లిదండ్రులు అంతా తమ బంగారు భవితవ్యం గురిం చే ఆలోచిస్తారని, అవసాన దశలో ఉన్న తరుణంలో తల్లిదండ్రులకు అండగా నిలవాలని, పిల్లల నుంచి ఏదీ ఆశించి తల్లిదండ్రుల పెంప కం ఉండదనే విషయాన్ని పిల్లలు గుర్తుంచుకో వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, జగిత్యాల పట్టణ అధ్యక్షులు అలిశెట్టి ఈశ్వర్, జిల్లా, డివిజన్ ప్రతినిధులు డాక్టర్ రాజగోపాలచారి, ఎలిమెల్ల సత్తయ్య, విద్యాసాగర్, గుండేటి గంగాధర్, సింగం గంగాధర్, వేముల దేవరాజం, వీఎన్‌చారి, మనోహర్‌రావు, హన్మాండ్లు, గోలి వేణు, లింగారెడ్డి, ప్రసాద్, నారాయణ, శివానందం, సుధాకర్‌రావు, చంద్రవౌళి, ఆనం దం, గంగారాం, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

మత్స్యశాఖను అభివృద్ధి చేసింది ఈటలే
వీణవంక, సెప్టెంబర్ 18: మత్స్యకారుల జీవన విధానాలపై అధ్యయనం చేసి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మత్స్యశాఖను అభివృద్ధి చేసింది మాజీమంత్రి, హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ అని మత్స్యశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం వీణవంక మండల కేంద్రంలో మత్స్యకారుల సొసైటీ సభ్యులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మత్స్యశాఖ అంటే ఆంద్రోళ్లదే అనేవారని, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యశాఖకు స్వయం ప్రతిపత్తిని ఈటల కల్పించారని అన్నారు. ఎకరాకు ఒక సభ్యున్ని తయారు చేసి సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా కల్పించి ప్రభు త్వ ఉత్తర్వులను జారీ చేయించారని అన్నారు. జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్ పింగిళి రమేష్, సొసైటీల నాయకులు రాయిశెట్టి శ్రీనివాస్, జే.కుమార్, గుర్రం రాజయ్య, రాయిశెట్టి సంపత్, వౌటం రాజయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.

ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
జగిత్యాల, సెప్టెంబర్ 18: సంచార జాతుల ఆర్థిక స్వావలంభన కోసం ఎంబీసీలుగా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రమైన జగిత్యాల సంచార జాతుల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ సంచార జాతుల కులాలు బీసీల్లో ఉండడం వల్ల ఆర్థిక స్వావలంభన జరుగడం లేదన్నారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ముఖ్యనాయకులు చవ్వ రాజయ్య, కర్నే శివకుమార్, భూపాల్‌పల్లి జిల్లా అధ్యక్షులు రాజ్‌కుమార్, వరంగల్ రూరల్ అధ్యక్షుడు రాజు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు భూపతి, పేరాల రామస్వామి, గాదె సమ్మయ్య, కోనేటి శ్రీనివాస్, సాయికృష్ణ, మేకల రామస్వామి, సాధుల రాములు, ముగ్గు వీరయ్య, సమ్మయ్య, రాంప్రసాద్, గంగ శంకర్, మల్లేశం, రవి, సురేష్, వెంకటేశ్వర్లు, రాయమల్లు, తిరుపతి, మహేందర్, బాలరాజు, సారయ్య, పోచయ్య, నర్సింహా, సత్యనారాయణ,సమ్మయ్య, గోపాల్, లక్ష్మినర్సయ్య, వీరయ్య, సంజీవ్, లింగయ్య, శ్రీనివాస్, వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.