కరీంనగర్

ప్రతినిధుల సభతో బ్యాంకు ఉనికికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 19: ప్రతినిథుల సభ ఏర్పడితే బ్యాంకుకు ప్రమాదకరమని, ఈ చర్యను వ్యతిరేకిస్తున్నామని, సభ్యులకు డివిడెండ్ తగ్గించడం అన్యాయమని, తప్పుడు నివేదికలతో ఎన్నికలు జరుగకుండా పాలకవర్గం మూడేళ్ళు అదనంగా అధికారంలో ఉండడం సరికాదని సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు సభ్యులు ఆరోపించారు. బుధవారం సాయంత్రం బ్యాం కు 32వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ అధ్యక్షతన వహిస్తూ తొ లుత బ్యాంకు ప్రగతిని వివరించారు. అనంతరం బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ వార్షిక నివేదికను సభ ముందు ఆమోదం కోసం సమర్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల బాలయ్య మాట్లాడు తూ గతంలో 20 శాతం ఇచ్చిన సభ్యు ల డివిడెండ్‌ను 10 శాతానికి తగ్గించడం సరికాదన్నారు. బ్యాంక్‌కు రిజ ర్వు బ్యాంక్ రూ.50 వేల జరిమానా ఎందుకు విధించారో స్పష్టం చేయాలని, ఆ పరిస్థితి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ప్రతినిధుల సభ ఏర్పాటు సరికాదని, దీని వల్ల బ్యాంక్ ఉనికి, శోభ తగ్గుతుందని, దీనికి అంగీకరించబోమన్నారు. డీసీవోకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని, ఫలితంగా ప్రస్తుత పాలకవర్గం అదనంగా మూడేళ్లు పీఐసీ పేరుతో అధికారంలో కొనసాగుతున్నదని, ఎన్నికల ఊసే లేదని గాజుల బాలయ్య ఆరోపించారు. రుణాలు అందరికీ ఇవ్వాలని మహాసభలో సభ్యులు ఒత్తిడి తేవడం వల్ల 15 శాతం ఉన్న పరిమితికి మించి 19 శాతం కుదువ రుణాలు ఇవ్వడం, మున్సిపల్ తదితర ప్రభుత్వ శాఖలకు పరిమితికి మించి డీడీలు ఇవ్వడంపై రిజర్వు బ్యాంక్ రూ.2 లక్షల మేర జరిమానా విధించగా, ఇక్కడి పరిస్థితిని వివరించడంతో దానిని రూ.50 వేలకు జరిమానాను తగ్గించారని సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఇక చూడబోమని, ఎన్నికలను సభ్యులు మర్చిపోవాలన్నారు. అందుకే ఎన్నికలు జరుపాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామన్నారు. బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ రెండు ఎటీఎంలకు అనుమ తి వచ్చిందని, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలలో వీటిని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ ఆడెపు రేవంత్, డైరెక్టర్లు అడిగొప్పుల పరమేశ్, గుడ్ల సత్యానందం, కోడం శ్రీనివాస్, సామల శ్రీనివాస్, బుర్ర రా జుగౌడ్, కోడం అశోక్, వేముల రాము లు, పత్తిపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ‘పొన్నం’
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ ర్కింగ్ ప్రెసి డెంట్‌గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఆయన అభిమానులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు వేస్తాం
సారంగాపూర్, సెప్టెంబర్ 19: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతామ ని జగిత్యాల ఆర్టీసీ డీవీఎం మద్దులేటి అన్నారు. బుధవారం బీర్‌పూర్ ఘాట్ రోడ్ ప్రాంతాన్ని ఆయన అధికారుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఆర్టీసీ ప్రమాదంలో 62 మంది మృతి చెందడంతో డిపో పరిధిలోని రహదారులు, ఘాట్ రోడ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బీర్‌పూర్ ఘాట్ రోడ్డు ప్రమాదాలకు అనుకూలంగా ఉందని, దీనిపై కలెక్టర్ తోపాటుఇతర అధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు. సారంగాపూర్ మీదగా బీర్‌పూర్, జన్నారం, కడెం ప్రాంతాలకు రద్దీ అధికంగా ఉన్నందున బస్సులను పెంచునున్నట్లు వెల్లడించారు.