కరీంనగర్

అర్హులను ఓటర్లుగా నమోదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన వారందరినీ గుర్తించి ఫారం 6లో దరఖాస్తులు పూరిస్తూ ఓటర్లుగా నమోదు చేస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు నమోదుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలతో సెప్టెంబర్ 10న ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 25 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వీలుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో 25 మంది జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సర్వే కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి మండలంలో ఒక ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, జిల్లాలోని ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది తప్పనిసరి చూసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే వెంటనే ఫారం 6 దరఖాస్తులు పూరిం చి, రెండు ఫొటోలు, ఒక గుర్తింపు కార్డు జత చేసి సంబంధిత బీఎల్‌వోకు, ఓటరు నమోదు కేంద్రంలో, తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువ ఓటర్లనమోదుకు జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు రెండులేదా మూడు కళాశాలలకు ఒక మండల అభివృద్ధి అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ల నమోదుకు ఫారం 6 ఫారాలు 27,829 దరఖాస్తులు, చనిపోయిన ఓట్ల తొలగింపుకు 4,141 ధరఖాస్తులు, ఓటర్ల సవరణలకు 5వేల దరఖాస్తులు అందినట్లు వివరించారు. జేసీ శ్యామ్ ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, మేయర్ రవీందర్‌సింగ్, డిఆర్‌వో భిక్షునాయక్, ఆర్‌డీవోలు చెన్నయ్య, ఆనంద్‌కుమార్, పలు పార్టీల ప్రతినిధులు కల్లెపల్లి రాజేందర్, జి.సతీష్, పైడిపల్లి రాజు, జీ.సత్యం, మోహన్, సయ్యద్ వాజొద్దిన్,తదితరులున్నారు.

కేసీఆర్ రైతు పక్షపాతి
సైదాపూర్, సెప్టెంబర్ 19: రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి వెన్నంపల్లి అధ్యక్షుడు, ఎక్లాస్‌పూర్ ఎంపీటీసీ సభ్యులు గుండేటి వనిత- శ్రీనివాస్‌తో పాటు దాదాపు 800 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. దీ నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కెప్టెన్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతీ అభ్యర్థి సా గునీరు తీసుకొస్తానని మాయ మాట లు చెప్పి గద్దెనెక్కేవారని, ఆపద్ధర్మ సీ ఎం కేసీఆర్ మాత్రం రైతులకు 24 గంటల విద్యుత్, సాగు, తాగునీరుతో పాటు రైతులు ఏదో కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రైతుబీమా పథకం, రైతులకు పెట్టుబడి కింద రైతుబంధు, రైతుల పంట పొలాల కోసం ప్రాజెక్టులు నిర్మించారన్నారు.
జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చాం
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విద్య, వైద్యంపై పటిష్టం చేశామని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాగాలుగా అభివృద్ధి చేశానని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు అన్నారు. గోదావరి నీళ్లు గౌరవెల్లి నుంచి సైదాపూర్‌కు వస్తాయి. కానీ, మిడ్ మానేరు ద్వారా అక్వాడిక్ ద్వారా సైదాపూర్ మండలానికి మళ్లించి రెండు నెలల్లో 23,700 ఎకరాలకు నీరు అందే దిశగా కృషి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో వావిలాల ఖాదీబోర్డు మెంబర్ తేరాల గోపాల రావు, జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీలు మునిగంటి స్వామి, గుండేటి వనిత- శ్రీనివాస్, మట్టెల రవి, జగురాణి బాయి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చలిమెల్ల రాజేశ్వర్ రెడ్డి, రైతు సమన్వయకమిటి మండల కన్వీనర్ రావుల రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్, నేతలు సంద శ్రీనివాస్, రాయిశెట్టి చంద్ర య్య, కొండ గణేష్, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ అధికారిని తొలగించాలి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికై బీసి సంక్షేమశాఖాధికారి కార్యాలయానికి వెళ్తున్న వారిపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీ్ధర్‌రాజు హెచ్చరించారు. బీసీ డబ్ల్యువో తీరుతో కార్యాలయానికి వెళ్లేందుకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడు తూ, బీసీ సంక్షేమం వీడి వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ఆరోపించా రు. కలెక్టర్ చొరవతో గత జూలై మా సంలోనే రెండు బాలుర, ఒక బాలికల వసతి గృహాలు మంజూరైనా, ఇప్పటికీ ప్రారంభించలేదని విమర్శించారు. గత ఆగస్టు 31వరకే ప్రవేశాలు నిలిపేయటంతోవందలాది మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు ప్రవేశాలు కోల్పోయారని ఆక్రోశించారు.