కరీంనగర్

నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలలపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి మైలారం భరత్ ఆరోపించారు. బుధవారం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యాలయంలో నిర్వహించిన కళాశాలల విద్యార్థి కమిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కళాశాలల్లో వౌళిక వసతులు కూడా కల్పించటంలేదని, విద్యార్థుల నుంచి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తుండటంతో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ.700కు వచ్చే విద్యాసామాగ్రికి రూ.2,600లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అదనపు పరీక్ష ఫీజుల పేర మరింత మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి చేయటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలకు అనుబంధంగా వసతి గృహాలకు అనుమతుల్లేకున్నా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాసిరకం భోజనంతోవిద్యార్థులను రోగాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సత్వరమే అధికారులు అనుమతుల్లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల్, రమేశ్, అనిత, శశి, ప్రేమ, నవీన్, సురేశ్, మదు,కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

అల్ఫోర్స్ విద్యార్థుల జయకేతనం
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 14నుంచి జరిగిన పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో స్థానిక అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జయకేత నం ఎగరేశారు. జెన్ నెక్స్ట్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినీ ఈ. అద్వైతి ట్రిపుల్ జంప్‌లో బంగారు, డిస్కస్ త్రోలో రజతం, రిలే పరుగుపందెంలో కాంస్యం, డిస్కస్‌త్రోలో పదో తరగతి విద్యార్థి జే. అరవింద్ రజతం, ఎంఏ రఖీ జ్యావలిన్ త్రోలో రజతం, 9వ తరగతికి చెందిన జే. పావని హైజంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రోలో రజత పతకాలు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డా. వీ.నరేందర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని, పోటీతత్వాన్ని పెంపొందించుకుని, తద్వారా సమాజంలో ముందంజలో నిలవడమే కాకుండా అవగాహన పెంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు ఇష్టమైన క్రీడారంగంలో నైపుణ్యతను పెంపొందించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఓటు వజ్రాయుధం
* కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల, సెప్టెంబర్ 19: ప్రజాస్వా మ్య దేశంలో ఓటు వజ్రాయుధమని, ఓటర్ల జాబితాలో విధిగా ప్రతి ఒక్క రూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఎడ్లబండి నడుపుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమో దు ముమ్మరంగా సాగుతుందని, ఓటరు నమోదు కేంద్రాల తనిఖీ చేశా రు. 2018వ సంవత్సరం జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ముందుగా ఓటర్ జాబితాలను చూసు కోవాలని లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శరత్ సూచించారు. కొత్త ఓటరు నమోదు చేసుకునేందుకు వీలుగా పొందపర్చిన దరఖాస్తు ఫారాలు 18 యేండ్ల నిండిన యువతీ, యువకులకు అందించా మ న్నారు. ఓటరు నమోదు చేసుకొని యువతీ, యువకులు తమకు నచ్చిన పాలకులకు ఓటు వేసి ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డాక్టర్ ఘంటా నరేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.