కరీంనగర్

24 గంటలు పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, సెప్టెంబర్ 19: ఏ ఒక్కరు ఓటు హక్కు లేదని అనకుండా క్షేత్రస్థాయి సిబ్బంది 24గంటలు పనిచేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గంభీరావుపేట కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్ స్థాయిలో ఏ ఒక్కరు ఓటు హక్కు లేదని ఫిర్యాదు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్షణం వారిని సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఇక్కడ పనిచేసినంత కాలం సస్పెండయిన వారిని తీసుకునేది స్పష్టంచేశారు. బూత్ స్థాయిలో ఏవేని తప్పులు వుంటే వాటిని ఈ నెల 25లోపు సరిచేయాలని కోరారు. ఓటర్ జాబితాలో తప్పులు సరిచేసి ఓటు హక్కు లేనివారిని తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క క్షేత్రస్థాయి సిబ్బంది బూత్‌స్థాయిలో ఒక్కటికి రెండు మార్లు ఓటర్‌జాబితాను పరీక్షించి ఓటు హక్కువున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఆధార్‌కార్డ్ లేకున్నప్పటికీ, 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు లేని వారు వుంటే వారి సర్ట్ఫీకేట్స్ ఆధారంగా ఓటు హక్కు కల్పించాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 43వేల ఓట్లు తొలగించబడినట్లు తెలిపారు. సంవత్సర కాలంగా స్థానికంగా ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది 24గంటలు పనిచేయాలని, ఎవ్వరు ఓటు హక్కు లేదని ఫిర్యాదు చేసిన ఆయా బూత్‌స్థాయి సిబ్బందియే బాధ్యత వహించవల్సింటుందని హెచ్చరించారు. తహసీల్దార్‌తో పాటు బూత్‌స్థాయి అధికారులు ఎప్పటీకప్పుడు అందుబాటులో వుండాలని ఆదేశించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు.
తహసీల్దార్ తప్పు చేసిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఆర్డీవో అనంత రెడ్డి, జిల్లా స్థాయి బూత్‌లేవల్ అధికారితో పాటు తహసీల్దార్ సుమతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గణనాథునికి మహా నివేదన
* సుల్తానాబాద్‌లో 151 రకాల ప్రసాదాలతో పూజ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 19: గణే ష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో నెలకొల్పిన గణనాథునికి బుధవారం భక్తిశ్రద్ధలతో తయారు చేసిన 151 వివిధ రకాల వంటకాలను నైవేద్యాలు గా సమర్పించారు. లంబోదరుడికి ప్రీతిపాత్రమైన వంటలను మహిళలు తయారు చేశారు. అలాగే ఆర్యవైశ్య భవన్‌లో గణేషుడి వద్ద 151 కలశలను ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేక పూజ లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం రోజు 151 మంది దంపతులకు ఈ కలశాలను అందజేస్తారు. గణనాథుని పూజలు అందుకున్న ఈ కలశ లను ఇంటిలోని పూజా మందిరంలో పెట్టుకొని పూజలు చేస్తే మంచిదని పలువురు భక్తులు అంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి ఆర్యవైశ్య భవన్‌లో గణేషుడి వద్ద మహిళలు పెద్దఎత్తున వచ్చి మంగళహారతులతో స్వామివారికి హారతి ఇచ్చారు. అలాగే గాంధీనగర్‌లో నెలకొల్పిన గణేషుడి వద్ద అనుమళ్ల బాపురావు ఆధ్వర్యం లో అన్నదానం జరిగింది. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉద యం, సాయంత్రం పూజలు, రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. చైర్మన్ అల్లెం కి సత్యనారాయణ, అల్లెంకి నందన్న, ఆర్యవైశ్య భవన్‌లో సంఘం నేతలు కొమురవెల్లి రామ్మూ ర్తి, దైత రాజేశం, చకిలం మారుతి, సిరిపురం రమేష్, పల్లా కిషన్, కొమురవెల్లి అంజయ్య, పల్లా సుధాకర్, పల్లా సురేష్, పల్లా సంతోష్, అల్లెంకి అశోక్, ముత్యాల రాములు, కేబీ శ్రీనివాస్, రామిడి శ్రీనివాస్, పల్లా భగవాన్, యెల్లెంకి రాజ న్న, ఎల్‌ఐసీ సంపత్, ఒల్లాల రాజు, కొమురవెల్లి సత్యం, రామిడి రవీందర్, మహిళలు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
* బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా బూతు కమిటీలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన శక్తి కేం ద్రాలు పని చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని రంగంపల్లిలో గల సాయి గార్డెన్‌లో పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి కేంద్రాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నవారు తమ పరిధిలో ఉన్న బూతు కమిటీలతో సమన్వయంతో పని చేయాలన్నారు. కమిటీ పరిధిలో 60 ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని ఏర్పాటు చేసి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా పని చేసినవారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు మీస అర్జున్ రావు, పుట్ల మొండయ్య, కేశవరావు, కటకం సునీల్ రావు, కాసర్ల తిరుపతి రెడ్డి, పిన్నింటి రాజు, పల్లె సదానందం, వివిధ మండల పార్టీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.