కరీంనగర్

అభివృద్ధిని ఆపొద్దు:ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 20: సీఎం కేసీఆర్‌పై కోపం ఉంటే ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పండి కానీ.. అభివృద్ధిని ఆపకండి అంటూ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డికి ఎంపీ కల్వకుంట్ల కవిత హితవుపలికారు. గురువారం జగిత్యాల నియోజక వర్గ స్థాయి టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం తెరాస పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిజామాబాద్ కవిత మాట్లాడుతూ కారాబోయేకాలంలో జగిత్యాలలో టీఆర్‌ఎస్ జెండా డాక్టర్ సంజయ్‌తోనే ఎగురవేస్తుందని,జగిత్యాల ప్రాంత అభివృద్ధికి సీఎల్పీ ఉపనేత, తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అడ్డుతగుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో డాక్టర్ ఎం. సంజయ్‌కుమా ర్ శాసనసభ్యునిగా గెలుపొందనున్నారని ఇది జగిత్యాలలో మొదటి ప్రచార సభ అన్నారు. కాగా జగిత్యాల ప్రాం త అభివృద్ధి గురించి మాట్లాడుతూ జీవన్‌రెడ్డినే టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని నిధులు, జగిత్యాల అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందన్నారు. మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ప్రభుత్వం పక్షాన రూ. 50కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి ఫలాలు ఇంటి ముందుకు రానున్నాయని అంటూ స్థానిక ప్రతిపక్ష నేత జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా అవివేవీ పట్టించుకోకుండా అన్ని నియోజక వర్గాల మాదిరిగానే జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కూడా నిధు లు తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో కూడా జగిత్యాలపై ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపలేదని, ప్రభు త్వం రూ. 1400 ఇండ్లు మంజూరు చేస్తే కేవలం 400 డబుల్ బెడ్ రూం లను మాత్రమే ఎమ్మెల్యేగా మంజూ రు చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను జీవన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని అనుభవం కలిగిన రాజకీయ నాయకులుగా కూడా అభివృద్ధిని విస్మరిస్తుండడం విచారకరమన్నారు. సమావేశంలో జగిత్యాల టీఆర్‌ఎస్ నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి: ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను మళ్లీ గెలిపిస్తాయని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం మెట్‌పల్లి పట్టణంలో టీఆర్‌ఎస్ కోరుట్ల నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లా డుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల సంక్షేమం,ప్రతి గ్రామా నికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేశామన్నారు. కోరుట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి విద్యాసాగర్‌రావును మరోసారి గెలిపించి గులాబీ జెండా ఎగురవేద్దామని, టీఆర్‌ఎస్‌కు పోటీ సాటి రాదన్నారు. అనంతరం పలు విష యాలపై మాట్లాడారు. మాజీ ఎమ్మె ల్యే టీఆర్‌ఎస్ అభ్యర్థి విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి, నేతలు సాయిరెడ్డి, సహదేవ్, రాంరెడ్డి, దశరథరెడ్డి, నియోజక వర్గంలోని పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని శాస్ర్తీ యువజన సంఘాల వినాయక మండపానికి వెళ్లి పూజలు చేశారు.

మనోహర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తాం
* కాసులపల్లి గ్రామస్థుల ప్రతిజ్ఞ
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 20: మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కడతామని, ఇంకోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని, పెద్దపల్లి ఎమ్మెల్యేగా తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తామని మండలంలోని కాసులపల్లి గ్రా మస్థులు ప్రతిజ్ఞ చేశారు. గురువారం ఉదయం తెరాస పార్టీకి, ఎమ్మెల్యే అభ్యర్థి దాసరికి మద్దతుగా వారంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దాసరి చంద్రారెడ్డి మా ట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజక వర్గం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. అలాగే ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకా లు ప్రవేశ పెట్టి అమలు చేస్తోందన్నా రు. అందుకే తమ గ్రామస్థులు తెరాస పార్టీకి ఓటు వేయాలని తీర్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ ఇనుగాల తిరుపతి రెడ్డి, మండల కోఆర్డినేటర్ ఇనుగాల అనంతరెడ్డి, దాసరి వెంకటరమణా రెడ్డి, మాజీ సర్పంచు ఇనుగాల తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.